Share News

‘ఎన్నికల ఘర్షణల బాధితులకు అండగా ఉంటాం’

ABN , Publish Date - May 24 , 2024 | 10:28 PM

ఎన్నికల ఘర్షణలో అరెస్టయిన దళవాయిపల్లె కూటమి నాయకులకు తాము అండగా ఉంటామని, అధైర్యపడవద్దని రూపానందారెడ్డి సతీమణి వరలక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్‌ భరోసా ఇచ్చారు.

‘ఎన్నికల ఘర్షణల బాధితులకు అండగా ఉంటాం’
రాజంపేట సబ్‌ జైలు వద్ద బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ముక్కావరలక్ష్మి, జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్‌

పుల్లంపేట, మే 24 : ఎన్నికల ఘర్షణలో అరెస్టయిన దళవాయిపల్లె కూటమి నాయకులకు తాము అండగా ఉంటామని, అధైర్యపడవద్దని రూపానందారెడ్డి సతీమణి వరలక్ష్మి, ఎమ్మెల్యే అభ్యర్థి అరవ శ్రీధర్‌ భరోసా ఇచ్చారు. దళవాయిపల్లెలో ఎన్నికల ఘర్షణకు సంబంధించి రాజారెడ్డి, సిద్దారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దస్తగిరి, సిద్దిక్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి రాజంపేట సబ్‌జైలుకు తీసుకెళ్ళారని, స్థానిక నాయకులు చెప్పడంతో ఆమె శుక్రవారం రాజంపేట సబ్‌ జైలుకు వెళ్ళి బాధితులకు అండగా ఉంటామని, అదైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. ఈ సందర్భం గా బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, తప్పుడుకేసులపై విచారణ చేసి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలకు అన్యాయం జరిగితే సహించేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య యాదవ్‌, వెంకటసుబ్బయ్య, సురేందర్‌రెడ్డి, కొత్తపల్లె రమణ ప్రకాష్‌రె డ్డి తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాద బాధితులకు భరోసా

మండల పరిదిలోని అప్పయ్యరాజుపేట వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుం బాలను ఆదుకుంటామని ముక్కా వరలక్ష్మి బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చారు. రాజంపేట వైపు వెళ్తున్న ఆమె అప్పయ్యరాజుపేట వద్దకు రాగానే ప్రమాదాన్ని తెలుసుకుని సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం ఆమె గాయపడిన వెంకటరమణను పరామర్శించి తాము అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. మృతి చెందిన సుబ్బనరసయ్య కుటుంబాన్ని ఓదార్చి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

Updated Date - May 24 , 2024 | 10:29 PM