Share News

కూటమి అభ్యర్థుల విజయానికి మాదిగలు కృషి చేయాలి

ABN , Publish Date - Apr 14 , 2024 | 12:14 AM

ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూట మి అభ్యర్థుల విజయానికి కృషి చేయా లని పీలేరు నియోజక వర్గంలోని మాదిగలకు ఎంఆర్‌పీ ఎస్‌ నాయ కులు పిలుపునిచ్చారు.

కూటమి అభ్యర్థుల విజయానికి మాదిగలు కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంఆర్‌పీఎస్‌ నాయకులు

పీలేరులో ఎంఆర్‌పీఎస్‌ నాయకుల పిలుపు

పీలేరు, ఏప్రిల్‌ 13: ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూట మి అభ్యర్థుల విజయానికి కృషి చేయా లని పీలేరు నియోజక వర్గంలోని మాదిగలకు ఎంఆర్‌పీ ఎస్‌ నాయ కులు పిలుపునిచ్చారు. ఎనడీఏ కూటమికి మద్దతు ఇస్తున్నట్లు తమ అధినేత మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎంఆర్‌పీ ఎస్‌ నాయకులు శనివారం స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో పీలేరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి దుడ్డు రామకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు తామంతా ఎనడీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నట్లు తెలిపారు. ప్రధా న మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంక య్యనాయుడు చొరవ కారణంగా నేడో, రేపో సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రానున్నట్లు తెలిపారు. ఎనడీఏ కూటమిలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టారని, సాంకేతిక కారణాల వల్ల అది నిలిచిపోయినా భవి ష్యత్తులోనూ వర్గీకరణకు తాను అను కూలమని ఆయన ప్రకటించిన విషయాన్ని రాష్ట్రంలోని మాదిగ లు గుర్తించాలన్నారు. అం దుకోసం పీలేరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి అయిన నల్లారి కిశోర్‌ కుమార్‌రెడ్డి, రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గెలుపును తమ బాధ్యతగా భావించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దుమ్ము చిన్నమాదిగ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు రవీంద్ర మాదిగ, శ్రీని వాసులు, గండికోట వెంకటేశ, సంధిపాకుల ఎర్రయ్య, ముల్లంగి రెడ్డప్ప, అమరాల వెంకటరమణ, గండికోట హుస్సేనయ్య, రవీశ్వర, బాలకృష్ణ, చరణ్‌ కుమార్‌, నాగరాజ, రాజేశ, రాజశేఖర్‌, కళ్యాణ్‌ కుమార్‌, అజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2024 | 12:14 AM