Share News

సీపీఎస్‌ రద్దు కోసం 4న ‘విశాఖ దీక్ష’

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:29 PM

సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 4న విశాఖలో ‘ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌, సాగర సంగ్రామం’ పేరుతో నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీ ఎస్‌ఈఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పచ్చార్ల సుధాకర్‌ తెలిపారు.

సీపీఎస్‌ రద్దు కోసం 4న ‘విశాఖ దీక్ష’
వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఏపీసీపీఎస్‌ఈఏ నాయకులు

పీలేరు, ఫిబ్రవరి 1: సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 4న విశాఖలో ‘ఓట్‌ ఫర్‌ ఓపీఎస్‌, సాగర సంగ్రామం’ పేరుతో నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లు ఏపీసీపీ ఎస్‌ఈఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పచ్చార్ల సుధాకర్‌ తెలిపారు. పీలేరులోని ఏపీసీ పీఎస్‌ఈఏ కార్యాలయంలో గురువారం ఆయన విశాఖ సభ పోస్టర్లు ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కేవలం వారం రోజుల్లో సీపీ ఎస్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్మోహనరెడ్డి అధికారంలో ఉన్నన్నాళ్లూ దాని గురించి పట్టించుకోలేదన్నారు. అనేకమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. పైపెచ్చు ఉద్యోగులకు ఆర్థికంగా నష్టం చేకూర్చే జీపీఎస్‌ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. తమ డిమాండ్‌ను పరిష్కరించకుండా మళ్లీ ఎన్నికలకు వెళుతున్న జగనకు వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని 3.5 లక్షల సీపీఎస్‌ ఉద్యోగులు తగిన గుణపాఠం నేర్పాలన్నారు. అందులో భాగంగా ఉద్యోగులను సమాయత్తం చేసేందుకు విశాఖలో సభ ఏర్పాటు చేశామని, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోని సీపీఎస్‌ ఉద్యోగులు పెద్దఎత్తున తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నోబుల్‌ టీచర్స్‌ అసోసియేషన రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి రమేశ, ఏపీసీపీఎస్‌ఈఏ నాయకులు ఆంజనేయులు, జయప్రకాశ, కిశోర్‌, వినోద్‌, ఈశ్వరయ్య, పోతంశెట్టి రమేశ, వేణు, జనార్దన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:29 PM