Share News

అశ్వవాహనంపై వెంకన్న చిద్విలాసం

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:49 PM

తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బాగంగా శనివారం దేవ దేవుడు అశ్వవాహనంపై భక్తులను కను విందుచేశారు. సేవ నిర్వహించారు.

అశ్వవాహనంపై వెంకన్న చిద్విలాసం
సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం

తంబళ్లపల్లె, ఫిబ్రవరి 17: తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వెంకటరమణ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బాగంగా శనివారం దేవ దేవుడు అశ్వవాహనంపై భక్తులను కను విందుచేశారు. సేవ నిర్వహించారు. గత తొమ్మిది రోజులగా శ్రీవారి బ్రహ్మోత్సవా లు టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభ వంగా నిర్వహిస్తున్నారు. టీటీడి వేద పండితులు శనివారం వేకువనే స్వామి వారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు పూర్తిచేశారు. అనంతరం విశేష అలం కార భూషితులైన శ్రీదేవీ, భూదేవీ సమేత స్వామి వారు పుష్పాలతో అలంకరించిన పల్లకిపై కొలువు దీరి ఆలయ మాడ వీధుల్లో వైభవం గా విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం సాయంత్రం అలంకార భూషితుడైన దేవదేవుడు వాహన సేవల్లో చివరిదైన అశ్వ వాహనంపై ఆశీనులై భక్తులను కటాక్షించారు. అశేష సంఖ్యలో భక్తు లు తరలివచ్చి స్వామి వారిని దర్శించుక్గున్నారు.వాహన సేవల్లో ఆలయ ఇనస్పెక్టర్‌ దిశంతకుమార్‌, ఉపప్రధా న అర్చకులు కృష్ణప్రసా ద్‌ భట్టర్‌, అర్చకులు రమేష్‌స్వామి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

వైభవంగా సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం

వాల్మీకిపురం, ఫిబ్రవరి 17: పట్టణ పడమర పొలిమేరల్లో ని ధర్మపథంలో వెలసిన కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి సమూహ ఆలయం లో సుబ్రహ్మణ్యస్వామి కల్యా ణోత్సవం కన్నుల పండువగా వైభవంగా నిర్వహించారు. శనివారం కృత్తికా నక్షత్రం సందర్భంగా ఆలయంలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామిని ప్రత్యేకంగా వేదపండితులు అలంకరించారు. షిరిడీసాయి సాలిగ్రామ తిరునారాయణ థార్మిక సేవా ట్రస్టు ఆధ్వర్యం లో కల్యాణోత్సవం అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వేదపండితులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు ఆలయ ట్రస్టు ప్రతినిధులు సారథి, రాధమ్మ, మీనాక్షి, శశికళ, వంశీ, భక్తులు పాల్గొన్నారు.

Updated Date - Feb 17 , 2024 | 11:49 PM