Share News

ఎన్నికల్లో పోటీకి వీసీకే అభ్యర్థులు సిద్ధం

ABN , Publish Date - Jan 09 , 2024 | 10:40 PM

వచ్చే సాధారణ ఎన్నిక ల్లో ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థా నాలలో పోటీ చేసేందుకు వీసీకే పార్టీ అభ్య ర్థులు సిద్ధంగా ఉన్నారని, పేద, మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుకోసం ప్రజలు వీసీకే అభ్యర్థు లను గెలిపించాలని ఆ పార్టీ నాగపట్నం ఎమ్మె ల్యే మహమ్మద్‌ షానవాజ్‌, తిరుపోరూరు ఎమ్మె ల్యే ఎస్‌.ఎస్‌.బాలాజీ విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల్లో పోటీకి వీసీకే అభ్యర్థులు సిద్ధం
తమిళనాడు ఎమ్మెల్యేలతో కలసి ప్రసంగిస్తున్న పీటీఎం శివప్రసాద్‌

మదనపల్లె, జనవరి 9: వచ్చే సాధారణ ఎన్నిక ల్లో ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థా నాలలో పోటీ చేసేందుకు వీసీకే పార్టీ అభ్య ర్థులు సిద్ధంగా ఉన్నారని, పేద, మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుకోసం ప్రజలు వీసీకే అభ్యర్థు లను గెలిపించాలని ఆ పార్టీ నాగపట్నం ఎమ్మె ల్యే మహమ్మద్‌ షానవాజ్‌, తిరుపోరూరు ఎమ్మె ల్యే ఎస్‌.ఎస్‌.బాలాజీ విజ్ఞప్తి చేశారు. మంగళ వారం స్థానిక సీఎస్‌ఐ జేసీఎం కమ్యూనిటీ హా లులో వీసీకే పార్టీ ఎన్నికల సన్నాహక సదస్సు నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు తమిళనాడు, కర్ణాటక, ఏపీకి చెందిన వీసీకే పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు పెద్దసంఖ్య లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌ కుబేరుల దోసిళ్లఓ పోసి, పేద, మధ్య తరగతి ప్రజల భవిష్యత్తును కాలరాస్తుంటే, ఏపీలో అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బీజేపీతో అంటకాగడం దుర్మార్గమన్నారు. పార్టీ అధిష్థానంతో చర్చించి త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ తెలుగు రాష్ర్టాల ఇనచార్జి బాలసింగం, ఏపీ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌, రాష్ట్ర నాయకులు గణపతి, ముత్యాల మోహన, టి.ఎ.పీరుబాషా, డాక్టర్‌ ఎం.ప్రభు, పాలకుంట శ్రీనివాసులు, బాలకృష్ణ, రెడ్డిప్రసాద్‌, మహేష్‌, కళ్యాణ్‌, బాస్‌ నాయకులు కె.వి.రమణ, పల్లం తాతయ్య, ఇర్ల రమణ, వీసీకే తమిళనాడు రాష్ట్రనేతలు నీలవనత్తునెలవన, దళపతి సుందర్‌, కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి వేణు పాల్గొన్నారు.

ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలి

కలికిరి: గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం జగన తెలుగు ప్రజలకు తీవ్ర నష్టం కలిగించాలని, ఇప్పుకైనా వడ్డీతో సహా పరిహారం చెల్లించి ఎన్నికలకు వెళ్ళాలని ‘బాస్‌’ సంఘం, వీసీకే పార్టీ నాయ కులు డిమాండు చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జగన రెడ్డి ఇచ్చిన హామీల జాబితాను ఏకరువు పెట్టా రు. కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పాలకుంట శ్రీనివాసులు భారతీయ అంబేడ్కర్‌ సేన (బాస్‌), వీసీకే పార్టీలకు చెంది న కృష్ణయ్య, గురునాథ, చౌడప్ప, హరినాథ, మల్లికార్జున, గురవయ్య, సిద్దయ్య, నరసిం హు లు, గంగాధర్‌, పెద్దనరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2024 | 10:40 PM