Share News

నిరుపయోగంగా షాదీమహల్‌

ABN , Publish Date - May 25 , 2024 | 11:23 PM

మండలంలోని తవళం రోడ్డులో 10ఏళ్లక్రితం నిర్మించిన షాదీమహల్‌ నిరుపయోగంగా మారిం ది.

నిరుపయోగంగా షాదీమహల్‌
నిరూపయోగంగా వున్న షాదీమహల్‌

నిమ్మనపల్లి, మే 25: మండలంలోని తవళం రోడ్డులో 10ఏళ్లక్రితం నిర్మించిన షాదీమహల్‌ నిరుపయోగంగా మారిం ది. మైనారిటీల అభివృద్ధి కొరకు గత టీడీపీ ప్రభుత్వం కొంత నిఽధులు మరి కొంత వక్ఫ్‌బోర్డు నిధులను మంజూరు చేసి స్థలం కొనుగోలు చేసి నిర్మించారు. షాదీమహల్‌ నిర్మించినటప్పటికీ వస తులు సక్రమంగా లేక పోవడంతో మర ళా నిధుల విడుదల చేసి బోరుబావి. ప్రహరీ, గేటు పేర్పాటు చేశారు. షాదీ మహల్‌ నిర్మించి 10ఏళ్ల కావస్తున్నా ఇప్ప టి వరకు అందులో ఒక్క షాదీ కూడా జరగక పోవడం గమనార్హం. దీంతో షాదీమహల్‌లో ఉన్న ష్యానలు బల్బులు, ఇతరత్రా సామగ్రి దొంగపాలయ్యాయి. అంతే కాకుండా ఇక్కడ ఏర్రాటు చేసిన బోరు మోటర్‌ కూడా కనిపించకుండా పోయింది టౌనకు దూరంగా ఉండడం తో అక్రమార్కులకు నిత్యం మందుబాబులు, ఇతరత్రా పనులకు అడ్డాగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం 2020లో రూ.10.5లక్షలలో ఎంపీ మిథున రెడ్డి నిధులతో పునర్నిర్మిస్తామని అక్కడే సమావేవం ఏర్పాటు చేసి వైసీపీకి చెందిన శిలాపథకం వేసి మూడేళ్ల గడుస్తుంది. ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు కదా మరింత దారుణంగా తయారైంది. చిన్నపాటి పెళ్లిళ్లు చేయాలన్నా అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని షాదీమహల్‌ ఉంటే అందరికీ ఉపయోగంగా ఉండేదని మండల ప్రజలు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారుల చోరవ చూసి షాదీమహల్‌ బాగు చేసి షాదీలు జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - May 25 , 2024 | 11:23 PM