Share News

14 వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:13 AM

ఎన్నికల నామినేషన్లు మొదలు కాక ముందు వర కు(ఏప్రిల్‌ 14వ తేదీ) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమో దు చేసుకోచ్చని మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

14 వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు
ఓటు నమోదుపై ప్రిన్సిపాళ్లకు సూచనలిస్తున్న ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి

మదనపల్లె టౌన, మార్చి 27: ఎన్నికల నామినేషన్లు మొదలు కాక ముందు వర కు(ఏప్రిల్‌ 14వ తేదీ) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమో దు చేసుకోచ్చని మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ పేర్కొన్నారు. బుఽధవారం సబ్‌కలెక్టరేట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, మూడు మండలాల ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదైన ఓటర్లతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు మాత్రమే ఇంకా 21 రోజులు గడువు ఉందన్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు విని యోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు ప్రభాకర్‌ రెడ్డి, పద్మావతి, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:13 AM