బద్వేలులో ఆగని భూ వివాదాలు
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:36 PM
బద్వేలు పట్టణం నానా టికీ విస్తరిస్తోంది. చుట్టూ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, వృత్తి వ్యాపారాల రీత్యా పట్టణానికి వచ్చి చేరుతున్నారు. దీంతో స్థలాల ధరలకు రెక్కలొచ్చి ప్రభుత్వ డీకేటీ స్థలాలు కూడా లక్షలాది రూపాయలు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పట్టాల ముఠా తయారై డీకే టీ పట్టాలకు నకిలీ పట్టాలు తయారు చేసి, విక్ర యించి భూవివాదాలకు తెరలేపారు.

అసలు ఇంటి పట్టాలు కొందరి వద్ద..
మరికొందరి వద్ద నకిలీ పట్టాలు
ఆందోళనలో అసలు లబ్ధిదారులు
బద్వేలు రూరల్, జూలై 8: బద్వేలు పట్టణం నానా టికీ విస్తరిస్తోంది. చుట్టూ గ్రామీణ ప్రాంత ప్రజలు తమ పిల్లల చదువుల కోసం, వృత్తి వ్యాపారాల రీత్యా పట్టణానికి వచ్చి చేరుతున్నారు. దీంతో స్థలాల ధరలకు రెక్కలొచ్చి ప్రభుత్వ డీకేటీ స్థలాలు కూడా లక్షలాది రూపాయలు పలుకుతున్నాయి. ఈ క్రమంలోనే నకిలీ పట్టాల ముఠా తయారై డీకే టీ పట్టాలకు నకిలీ పట్టాలు తయారు చేసి, విక్ర యించి భూవివాదాలకు తెరలేపారు. అయితే బద్వే లు రెవెన్యూ డివిజను అయిన తరువాత మొదటి ఆర్డీఓ ఆకుల వెంకటరమణ నకిలీ పట్టాలపై ఉక్కు పాదం మోపి నకిలీ పట్టాలు తయారు చేసే ముఠా ను మరికొందరిని దోషులుగా గుర్తించి జైలుకు పంపారు. కొంతకాలం భూవివాదాలు సద్దుమని గినా ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో అస లైన లబ్ధిదారులకు, నకిలీ పట్టాలున్న లబ్ధిదారుల నడుమ వివాదాలు సాగుతూ అసలైన పట్టా దారులు ఆందోళనకు గురవుతున్నారు.
నకిలీ పట్టాలు ఇంకా ఉన్నాయా ?
బద్వేలు రెవెన్యూ డివిజన్ అయిన తరువాత మొట్ట మొదటి ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన ఆకుల వెంకటరమణ నకిలీ పట్టాలపై దృష్టి సారించి నకి లీ పట్టాల గుట్టు రట్టు చేశారు. కొంత మందిని నకి లీ పట్టాల దోషులుగా గుర్తించి జైలుకు పంపడంతో కొంత కాలం భూవివాదాలు సద్దుమనిగాయి.
ఇటీవల మొదలైన భూవివాదాలు
మొదట తలెత్తిన భూవివాదాలు కొందరు అధికా రుల చర్యలతో సద్దుమనిగినా ఇటీవల మళ్లీ పడగ విప్పేందుకు సిదమవుతున్నాయి. డీకేటీ పట్టాలు ఎక్కువగా ఉన్న సుందరయ్యకాలనీ, మహ్మద్ కాలనీ, మార్తోమానగర్, ఐలమ్మ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థలం తమదేనంటూ రెండు వర్గాలు వాదనలకు దిగుతుండడంతో అసలు పట్టాదారుడు ఎవరు? నకిలీ పట్టాదారుడు ఎవరో గుర్తించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. భూవివాదాలు మళ్లీ మొదటికి వచ్చేసరికి అసలైన లబ్ధిదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
రెవెన్యూ శాఖలో రికార్డులు మాయం
డీకేటీ పట్టాలు ఎక్కువగా ఉన్న గోపవరం మండ ల రెవెన్యూ కార్యాలయంలో కొన్ని రికార్డులు మా యమైనట్లు సమాచారం. రికార్డులు మాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన వారు ప్రస్తు తం ఇక్కడ విధులు నిర్వహించడంలేదు. రికార్డులు మాయమైన స్థానే నకిలీ పట్టాలు తయారయ్యా యి. దీంతో అసలైన లబ్ధిదారుడు ఎవరో గుర్తిం చలేని స్థితిలో రెవెన్యూ అధికారులున్నారు. అసలైన లబ్ధిదారులు రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినా రికా ర్డులు లేవని బాధితులకు రెవెన్యూ అధికారులు చెబుతుండడం గమనార్హం.
పంచాయతీ పెద్దమనుషులు
పట్టణంలో నెలకొన్న భూవివాదాలు పరిష్కరించేం దుకు పట్టణంలో దాదాపు ఓ ఐదారు బ్యాచ్‌లున్నా యి. భూ వివాదం ఏర్పడిన వెంటనే సమాచారం తెలుసుకుని అసలైన లబ్ధిదారులు పెద్దమనుషుల పంచాయతీ వద్దకు వెళుతున్నారు. అయితే రెవె న్యూ అధికారులు జునైన్ సర్టిఫికెట్లు ఇవ్వకపోడం వల్ల బాధితులు పెద్ద మనుషుల మధ్య పంచాయ తీ చేసుకునేందుకు సిద్దమవుతున్నారు. పెద్దమను షుల వద్ద పంచాయతీలో అసలైన లబ్ధిదారులకు, నకిలీ పట్టా కలిగిన వారికి ఇద్దరిలో ఒకరికి లాభా న్ని చేకూర్చి తాము కొంత సొమ్మును వెనకేసుకుం టూ పంచాయతీలు నడుపుతున్నారు.
ఇప్పటికైనా పరిష్కారమవుతాయా
పట్టణంలో పదేళ్లగా భూవివాదాలు మొదల య్యాయి. ఎంత మంది అధికారులు మారుతున్నా భూవివాదాలు పరిష్కరించడంలో విఫలమయ్యార న్న ఆరోపణలు వెలువడుతున్నాయి. రికార్డుల ప్రకా రం అసలైన లబ్ధిదారుని గుర్తించే వీలు లేకపోవడ మే సమస్యగా తయారైనట్లు బాధితులు వాపోతు న్నారు. అసలైన లబ్ధిదారుడిని గుర్తిస్తే సమస్యే లే దు కదా అన్న వాదనలు ప్రజల నుంచి మేధావి వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎక్కడా లేనివిధంగా బద్వేలులో భూ వివాదాలు జరుగుతు న్నా ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోక పోవడం విడ్డూరమని పలువురు వివరిస్తున్నారు.
వివాదాలు ఉన్నాయి
పట్టణంలోని గోపవరం ప్రాంతానికి చెందిన డీకేటీ ఇంటిస్థలాలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నా యి. సమస్యలు పరిష్కరించేందుకు రికార్డులు అందుబాటులో లేవు. గతంలో నమోదైన నకిలీ పట్టాల కేసుకు సంబంధించి కొన్ని రికార్డులు ఉన్న తాధికారుల వద్ద ఉండగా మరికొన్ని రికార్డులు లేవు. దీంతో సమస్యను పరిష్కరించ లేకున్నాం. డీకే టీలను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమైనా ఈ ప్రాంతంలో అమ్మకాలు కొనసాగడం విడ్డూరం. త్వరలోనే ఈ సమస్య పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపడతాం.
- ఎం.రోశయ్య, గోపవరం తహసీల్దారు