ప్రతి ఉద్యోగికీ బదిలీ సర్వసాధారణం
ABN , Publish Date - Jul 12 , 2024 | 11:51 PM
ప్రతి ఉద్యోగికి బదిలీ సర్వసాధారణమని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ వెంకటేశ, వీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు చంద్రశేఖర్‌రెడ్డి, సీమల శ్రీనివాసులు అన్నారు.
వీరపునాయునిపల్లె, జూలై 12: ప్రతి ఉద్యోగికి బదిలీ సర్వసాధారణమని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు మేనేజర్ వెంకటేశ, వీఆర్‌ఎస్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ అధ్యాపకులు చంద్రశేఖర్‌రెడ్డి, సీమల శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం ఏపీజీ బబ్యాకులో క్యాషియర్‌గా పనిచేస్తున్న గీతాధర్ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు అభినందన సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఖాతాదారులకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సే వలు అందించి మన్ననలు పొందారన్నారు. నిష్పక్షపాతంగా విధులను నిర్వహించా రన్నారు. అనంతరం గీతాధర్‌ను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ శ్యామ్‌ప్రసాద్, క్యాషియర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు.