Share News

‘దాహం తీర్చినందుకు కండువా వేశారు’

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:06 PM

ఇం టికి వచ్చారని తాగేందుకు నీళ్లిస్తే కండువా వేసి, ఫొటో లు తీసి ప్రసార వైసీపీలో చేరినట్లు ప్రచారం చేశారని మైనార్టీ నాయకుడు మేకల మహబూబ్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు.

‘దాహం తీర్చినందుకు కండువా వేశారు’
మాట్లాడుతున్న మేకల మహబూబ్‌బాషా

సుండుపల్లె, ఏప్రిల్‌ 5: ఇం టికి వచ్చారని తాగేందుకు నీళ్లిస్తే కండువా వేసి, ఫొటో లు తీసి ప్రసార వైసీపీలో చేరినట్లు ప్రచారం చేశారని మైనార్టీ నాయకుడు మేకల మహబూబ్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేం ద్రంలోని టీడీపీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన శుక్ర వారం మధ్యాహ్నం విలేకరు ల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీ అభ్యర్థి మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి అమర్‌నాథరెడ్డి తన ఇంటికి వచ్చి వైసీపీలో చేరమని వత్తిడి చేయగా, తాను టీడీపీలోనే ఉన్నానని చెప్పానన్నారు. బలవంతంగా కండువా వేసి, ఫొటోలు తీసి ప్రచారం చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉన్నానని, అందులోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఈ విషయంపై మండల టీడీపీ అధ్యక్షుడు రెడ్డెప్ప మాట్లాడుతూ వైసీపీ రోడ్‌షోలకు, ప్రచారానికి జనం రాకపోతే టీడీపీ కార్యకర్తల ఇంటికి వెళ్లి బలవంతంగా కండువాలు వేపి పార్టీలో చేరినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మండలంలో ఒక్క టీడీపీ కార్యకర్త, నాయకుడు కూడా వైసీపీలో చేరరన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు ప్రసాద్‌రాజు, చంద్రమౌళి, మడితాడు బాషా, ఎల్‌వీ రమణ, గ్రామ అధ్యక్షుడు సుబ్బరామ్‌, ఉపసర్పంచ్‌ ఆకుల శివకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2024 | 11:06 PM