Share News

ఆశా వర్కర్లకు వెంటనే వేతనాలు పెంచాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:27 PM

రాష్ట్రంలో ఆశా వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఆశా వర్కర్ల అసోసియేషన జిల్లా అధ్యక్షురాలు ధన లక్ష్మి డిమాండ్‌ చేశారు.

ఆశా వర్కర్లకు వెంటనే వేతనాలు పెంచాలి
డిప్యూట డీఎంహెచవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లు

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 1: రాష్ట్రంలో ఆశా వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఆశా వర్కర్ల అసోసియేషన జిల్లా అధ్యక్షురాలు ధన లక్ష్మి డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక డిప్యూటీ డీఎంహెచవో కార్యాల యం వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా గర్భిణులు, చిన్నా రులు, ప్రజలకు వైద్య సేవలందిస్తున్న ఆశా వర్కర్లు గౌరవ వేతనంతోనే పనిచేస్తున్నా రన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు విపతీరంగా పెరిగాయని, ప్రభుత్వం ఇచ్చే వేతనా లతో జీవనం కష్టంగా ఉందన్నారు. జనాభా ప్రాతిపదికన ఆశా వర్కర్లకు విధులు కేటాయించాలన్నారు. పని ఒత్తిడి పెంచారే కాని ఆశా వర్కర్లకు సెలవులు మంజూరు చేయడం లేదన్నారు. ఆశా వర్కర్లకు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీ యూసీ పట్టణ కార్యదర్శి తిరుమల, ఆశా వర్కర్లు కల్పన, కుమారి, శైలజ, రేఖా. విమలాంజన, రుక్మిణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 11:27 PM