Share News

పల్లె దారి శిథిలం...!

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:41 PM

రహదారులు బాగుంటే పల్లె ప్రజలకు సగం కష్టాలు తప్పుతాయి.

పల్లె దారి శిథిలం...!
కాలువపల్లె సమీపంలో కంకర తేలిపోయిన రోడ్డు

కనీస మరమ్మతులకు నోచుకోని వైనం

ములకలచెరువు, జూన 8: రైతులు వ్యవసాయ దిగుబడులను మార్కెట్‌కు తరలించలన్నా...ఎరువులు, విత్తనా ల కోసం వెళ్లాలన్నా ఆస్పత్రులకు వెళ్లాలన్నా ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ఆధారపడి ప్రయాణం సాగిస్తారు. అలాంటాది పల్లె దారి శిథిలమైంది. మండలంలోని చౌడసముద్రం - కాలువపల్లె రోడ్డు దుస్థితికి చేరింది. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాలంలో రోడ్ల మరమ్మతులకు చిల్లిగవ్వ కూడా విదల్చ లేదు. దీంతో ఈ మార్గంలో ప్రయాణం అంటే ప్రజలు బెంబే లెత్తిపోతున్నారు. చౌడసముద్రం నుంచి కాలువపల్లె వరకు సుమారు ఎనిమిది కిలో మీటర్ల రోడ్డు దెబ్బతింది. దీంతో చౌడస ముద్రం గుత్తావారిపల్లె, గుత్తావారిపల్లె తాండా, కనికలతాండా, నెమ్మచెర్లబావి, రెడ్డివారిపల్లె, కుర వాండ్లపల్లె, కాలువపల్లె వరకు ఉన్న రోడ్లులో వాహనదారులు వెళ్లాలంటే హడలిపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jun 08 , 2024 | 11:41 PM