Share News

కేంద్రం తెచ్చిన రవాణా బిల్లును వెనక్కి తీసుకోవాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:47 PM

రవాణా రంగం లో కేంద్రం తీసుకొచ్చిన హిట్‌ అండ్‌ రన బిల్లుపై నిర్ణయాన్ని పునరాలోచించి వెన క్కి తీసుకోవాలని మదనపల్లె లారీ, ఐచ ర్స్‌ డ్రైవర్లు, క్లీన ర్ల అసోసియేషన అధ్య క్షుడు, మున్సిపల్‌ వైస్‌చైర్మన జింకా వెం కటాచలపతి డిమాండ్‌ చేశారు.

 కేంద్రం తెచ్చిన రవాణా బిల్లును వెనక్కి తీసుకోవాలి
లారీ డ్రైవర్లు, క్లీనర్లతో కలసి నిరసన తెలుపుతున్న జింకా వెంకటాచలపతి

మదనపల్లె, జనవరి 5: రవాణా రంగం లో కేంద్రం తీసుకొచ్చిన హిట్‌ అండ్‌ రన బిల్లుపై నిర్ణయాన్ని పునరాలోచించి వెన క్కి తీసుకోవాలని మదనపల్లె లారీ, ఐచ ర్స్‌ డ్రైవర్లు, క్లీన ర్ల అసోసియేషన అధ్య క్షుడు, మున్సిపల్‌ వైస్‌చైర్మన జింకా వెం కటాచలపతి డిమాండ్‌ చేశారు. మదనపల్లె పట్టణం పుంగనూరురోడ్డులోని లారీవర్కర్స్‌ అసోసియేషన కార్యాలయంలో శుక్రవారం లారీ, ఐచర్‌ డ్రైవర్లు, క్లీనర్లతో కలసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రవాణా రంగంలో తీవ్ర కలకలం రేపుతోందన్నారు. ట్రక్కు లేదా లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ఏదైనా జరిగితే రూ.7లక్షలు జరిమానా, పదేళ్ల జైలు నిబంధనలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సివస్తోందన్నారు. ఇలాంటి బిల్లుతో సామా న్యుడికి అసామాన్యమైన శిక్ష పడే అవకాశమే కాదు..ఆ కుటుం బం చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం పునఃపరిశీలన చేయా లని వెంకటాచలపతి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఆసంఘం ఉపాధ్యక్షుడు కె.చం ద్ర, ఎస్‌.రియాజ్‌, ఎస్‌ఎంషఫీ, కార్యదర్శి ముక్బుల్‌, ప్రధాన కార్యదర్శి జి.మల్లికార్జున, ఎస్‌.ఫరీద్‌, వర్కింగ్‌ ప్రసిడెంట్‌ మహమ్మద్‌ ఖాజా, చలపతి, కె.నాని, కోశాధికారి పి.అహమ్మద్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:47 PM