Share News

సుప్రీం తీర్పు జగన్‌రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు

ABN , Publish Date - Jan 30 , 2024 | 10:58 PM

సుప్రీంకోర్టు తీర్పులు జగన్‌రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్‌ అన్నారు.

సుప్రీం తీర్పు జగన్‌రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు
విలేకరులతో మాట్లాడుతున్న హరిప్రసాద్‌

కడప (ఎర్రముక్కపల్లె), జనవరి 30 :సుప్రీంకోర్టు తీర్పులు జగన్‌రెడ్డి ప్రభుత్వానికి చెంప పెట్టు అని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బి.హరిప్రసాద్‌ అన్నారు. మంగళ వారం కడప నగరంలోని హరిటవర్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు సభలు జనంతో కళకళలాడుతుంటే జగన్‌ సభలు వెలవెలబోతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. జగన్‌ ప్రభుత్వంలో ఏ వర్గానికి కూడా మేలు జరగలేదన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఏపీ దేశంలో ఆరవ స్థానంలో ఉందని ప్రతిరోజూ కనీసం 70 కేసులు నమోదవుతున్నా యన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ రైతులపై రుణభారం ఎక్కువగా ఉందన్నా రు. నిరుద్యోగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని, ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు. ఇప్పటికే రాష్ట్రం 13 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందన్నారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసుల్లో జగన్‌రెడ్డికి కోర్టులో ఎదురుదెబ్బ లతోపాటు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు సిగ్గు పడాలన్నారు. నిజం గెలవ డానికి ఆలస్యం కావచ్చు కానీ కచ్చితంగా గెలుస్తుందన్నారు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ప్రజలు జగన్‌ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే ఆయనకు అర్థమైం దన్నారు .ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుబ్బారెడ్డి, అమీర్‌బాషా, పీరయ్య, ఖాసిం తదితరులు పాల్గొన్నారు.

పులివెందుల టౌన్‌: చంద్రబాబునాయుడుపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసులు తప్పుడు కేసులని సుప్రీంకోర్టు తీర్పుతో రుజువైందని జిల్లా అధికార ప్రతినిధి అశోక్‌, కార్యనిర్వాహక కార్యదర్శి నాగిరెడ్డి, సీనియర్‌ నాయకులు సూర్య నారాయణరెడ్డి, యువనాయకులు అమర్‌. మంగళ వారం స్థానిక టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో వైసీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలిందన్నా రు. ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్ర ప్రజలు చంద్రబాబు వెంటే ఉన్నారన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 10:58 PM