Share News

సీతారాముల చరితం.. సకల పాపహరణం

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:41 PM

శ్రీరామ నవమి వేడుకులను ప్రజలు బుధవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు.

సీతారాముల చరితం..  సకల పాపహరణం
పీటీఎంలో సీతారాముల కల్యాణం

వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

కనులపండువగా

సీతారాముల కల్యాణోత్సవాలు

భక్తులతో కిటకిటలాడిన రామాలయాలు

మదనపల్లె అర్బన, ఏఫ్రిల్‌ 17: శ్రీరామ నవమి వేడుకులను ప్రజలు బుధవారం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని అమ్మేనేని వీధిలోని కోదండరామాలయంలో ఆలయకమిటీ సభ్యులు భవానీప్రసాద్‌, దుగ్గిరెడ్డి, జగనమోహన, సాయి, శంకర్‌యాదవ్‌ ఉదయం సీతారాముల కల్యాణం అత్యంతవైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. భక్తులకు తీర్థప్రసాదాల తోపాటు వడపప్పు, పానకం అందజేశారు. మదనపల్లె వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా పుం గనూరురోడ్లులో బోయకొండ ఆర్చీవద్ద, బస్సు సెల్టర్‌ వద్ద, అప్పారా వువీఽధి, ఘటిక ఆజంనేయస్వామి ఆలయం వద్ద వడపప్పు, పానకం, మజ్జిగ ప్రజలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్ష కార్య దర్శులు శ్రీనాథ్‌, అమరనాథ్‌, ట్రెజరర్‌ లక్ష్మీదీపక్‌, సభ్యులు బాలాజీ, అనిల్‌, శివప్రసాద్‌, నాగారాజ, పాల్గొన్నారు. పట్టణం కోటవీధిలో మదనపల్లె నవయుగ స్వర్ణకారుల సంఘం జ్యువెలర్సీ షాపు అసోసి యేషన ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకులు వైభవంగా ర్వహించా రు. అఖిల భారత విశ్వకర్మ మహా సభ జాతీయ ఉపాధ్యక్షుడు, రాష్ట్ర స్వర్ణకారుల సంఘం కార్య నిర్వాహక కార్యదర్శి డాక్టర్‌ అప్పిని పల్లె భాస్కరాచారి రాములవారి భారీ చిత్రపటం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జ్యువెలర్సీ షాపు యజమా నులు, స్వర్ణకారులు పాల్గొన్నారు. విశ్వహిందూ పరిషత జిల్లా, నగర సమితి ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. వరాల ఆంజనే యస్వామి ఆలయంలో ఆలయకమిటీ ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అయోథ్యనగర్‌లో శ్రీరామనవమి సందర్భంగా సీతారా ము ల కల్యాణం నిర్వహించి భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక ఎస్టేట్‌లో వినాయకస్వామి కమిటీ సభ్యులు శ్రీనివాసులురెడ్డి, ప్రేమ్‌ చంద్‌, ఆది, బాలు, రాజశేఖర్‌, బావజాన, తులసీ రాం, జయరామ్‌, దేవా, మహేష్‌, అన్వేష్‌లు భారీగా అన్నదానం చేశారు. నీరుగట్టు వారిపల్లె కోదండరామాలయంతోపాటు కాట్లాటపల్లె రోడ్డులోని ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం, కురవంకలోని ఆంజనే యస్వామి ఆలయం, సీటీఎం వీరాంజనేయ స్వామి ఆలయం, పుంగ నూరురోడ్డు, నిమ్మనపల్లె రోడ్డులోని పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాల్లో శ్రీరామనవమి వేడుకులు వైభవంగా నిర్వహించారు.

మదనపల్లె టౌన: శ్రీరామనవమి సందర్భంగా బుధవారం పట్టణం లో ఉమ్మడి కూటమి అభ్యర్థి షాజహానబాషా పలుచోట్ల శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్నారు. బుధవారం స్థానిక అమ్మినేని వీధిలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు భవానిప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ నవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బసినికొండ లారీ బాడీ బిల్గింగ్‌ అసోసియేషన నాయకులు షాజహానబాషాను మర్యా దపూర్వకంగా కలిసారు. అలాగే తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌చినబాబు, దొరస్వామినాయుడు వేడుకల్లో పాల్గొన్నారు.

పీలేరులో: శ్రీరామ నవమి వేడుకలను బుధవారం పీలేరు పట్ట ణంలో వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని కోదండరామ స్వా మి ఆలయం, సదుం రోడ్డులోని కళ్యాణ సీతారామస్వామి దేవస్థా నంలో కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించారు.భక్తుల జైశ్రీరామ్‌ నినాదాల నడుమ వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కల్యాణోత్సవాలను కన్నులపండువగా నిర్వహించారు. కల్యాణోత్సవాలను తిలకించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలి వచ్చారు. వచ్చిన భక్తులకు పానకం, వడపప్పుతోపాటు ఆయా ఆల య కమిటీల ఆధ్వర్యంలో అన్నదానాలు చేశారు. శ్రీరామ నవమి సందర్భంగా పట్టణంలోని ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులు ఉదయం ‘శోభా యాత్ర’ పేరిట స్కూటర్‌ ర్యాలీ చేశారు. వేర్వేరుగా జరిగిన కార్యక్ర మాల్లో ఆలయ కమిటీ అధ్యక్షులు కె.రామకృష్ణారెడ్డి, నంద్యాల మణి, అర్చకులు ఆనందస్వామి, తిరుమలాచార్యులు పాల్గొన్నారు.

కలికిరిలో: మండలంలోని పలు ప్రాంతాల్లోని సీతారాములవారి ఆలయాల్లో బుధవారం శ్రీరామ నవమి వేడుకలను వైభవంగా నిర్వ హించారు. పట్టణంలోని రామాలయం, రెడ్డివారిపల్లె, క్రాస్‌రోడ్డు, రం గనాథపురం తదితర గ్రామాల్లో నవమి వేడుకలను వైభవంగా నిర్వ హించారు. రాత్రి ఉత్సవ విగ్రహాలను ఆయా గ్రామాల్లో గ్రామోత్స వం నిర్వహించారు. రామాలయాల వద్ద భక్తులకు పానకం, వడప ప్పు విరివిగా పంపిణీ చేశారు. మరి కొన్ని ఆలయాల వద్ద అన్నప్ర సాదాలను పంపిణీ చేశారు.

కురబలకోటలో: మండలంలో శ్రీరామనవమి వేడుకలను బుధవా రం వైభవంగా నిర్వహించారు. మండలంలోని అంగళ్ళు, కురబల కోట, పిచ్చలవాండ్లపల్లె, కమతంపల్లె, మొలకవారిపల్లె తదితర గ్రామాల్లోని రాములవారి ఆలయాల్లో సీతారాముల కల్యాణోత్సవ వేడుకలను పండితులు సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అలాగే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లను చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

పెద్దమండ్యంలో: పెద్దమండ్యం మండలంలో బుధవారం శ్రీరామ నవమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. పెద్దమండ్యం, రెడ్డివారిపల్లి, ముసలికుంట, బండ్రేవు, మందలవారిపల్లి, గుడిసెవా రిపల్లి, గురివిరెడ్డిగారిపల్లి, మిట్టామాలపల్లి, గుర్రంవాండ్లపల్లి, కలి చెర్ల, కోటగుట్టపల్లి, శివపురం, వెలిగల్లు, బండమీదపల్లా, కోట గుట్టపల్లి రామాలయాల్లో సీతరాముల కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. అనంతరం పురవీధుల్లో సీతారాముల గ్రామోత్సవం నిర్వహించారు. వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఆయా గ్రామాలలో ధర్మకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

గుర్రంకొండలో:గుర్రంకొండ మండలంలో శ్రీరామనవమి వేడుకల ను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయాన్నే ఆలయాల్లో ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం సీతారాముల కల్యా ణోత్సవం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

కలకడలో:కలకడ మండల ప్రజలు శ్రీరామ నవమి పండుగను వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నడిమిచెర్లలోని కోదం డరామాలయం, గువ్వలవారిపల్లె, సింగనొడ్డుపల్లె, మర్రిమానుపల్లె, గుడిబండ, తెట్టు గ్రామాలోని ఆలయాల్లో సీతారాముల కల్యాణో త్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో స్వామి వారి ని పురవీధుల్లో ఊరేగించి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలతోపాటు, అన్నదానాలు చేశారు.

బి.కొత్తకోటలో: బి.కొత్తకోట మండలంలో బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నారు. పట్టణంలోని పోకనాటివీధి, హరిమందిరంవీధి లతో పాటు వివిధ గ్రామాలలో వున్న రామా లయాలలో ప్రత్యేక పూజలు చేశారు. స్ధానికంగా పోకనాటివీధిలో వున్న పురాతన రామాలయంలో సీతారాముల వారి కల్యాణోత్సవా న్ని కనుల పండువగా నిర్వహించారు. జ్యోతిచౌక్‌లో దేరింటికుమార్‌, భక్తులకు పానకం, వడపప్పు పంపిణీ చేశారు.

పెద్దతిప్పసముద్రంలో: పీటీఎం మండలంలోని పలు గ్రామాల్లోని రామాలయాల్లో బుధవారం శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించారు.ఈ సందర్బంగా సీతారాములను దర్శించుకోవడానికి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. రంగసముద్రం లోని విసనకర్ర వాండ్లపల్లెలో వెలసిన కోదండ రామాలయంలో ఉదయం నుండి స్వామి వారికి అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆల యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని వేదపండితుల మంత్రోఛ్చార ణల నడుమ వైభవంగా నిర్వహించారు. రాత్రి స్వామి వారి ఉత్సవ విగ్రహ మూర్తులను సుందరంగా అలంకరించి మేళతాళాలతో, బళ్లారి డ్రమ్ములతో, పురవీధుల్లో అత్యంతవైభవంగా ఊరేగించారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండలంలోని పలు ఆలయాల్లో బుధ వారం శ్రీరామనవమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులను దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో శేష సాయిబాబా ఆలయంలో రాములవా రికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.

Updated Date - Apr 17 , 2024 | 11:41 PM