అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం ఉండాలి: కమిషనర్
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:59 PM
అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కమిషనర్ మనోజ్‌రెడ్డి తెలిపారు.
కడప ఎర్రముక్కపల్లె, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యకు పరిష్కార మార్గం చూపాలని కమిషనర్ మనోజ్‌రెడ్డి తెలిపారు. సోమవారం కడపనగరం కార్పొరేషన వీడియో కాన్ఫరెన్స హాలు లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ దాదాపు 34 అర్జీలు వచ్చాయన్నారు. వీటిలో ఇంజనీరింగ్ విభాగానికి 10, టౌనప్లానింగ్ 7, రెవెన్యూ 8, హెల్త్ 3, ఎస్టాబ్లి్‌షమెంటు ఒక అర్జీ వచ్చిందన్నా రు. అలాగే సచివాలయం 2, యూపీఏ 3 వచ్చాయని, వీటన్నింటినీ పరిశీలించి అధికారులకు పం పినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అడిషనల్ కమిషనర్ రాకేశచంద్రం, ఈఈ నారాయణ స్వామి, ధనలక్ష్మి, ఏసీపీ మునిరత్నం, ఎంహెచఓ చంద్రశేఖర్ పాల్గొన్నారు.