రైల్వే బ్రిడ్జితో ఇబ్బంది లేకుండా చూడాలి
ABN , Publish Date - Jul 15 , 2024 | 10:35 PM
మండల కేంద్రం సమీపంలోని పున్నాటివారి పల్లె వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంతో గ్రామానికి ఇబ్బం దులు ఏర్పడతాయని గ్రామస్థులు రైల్వే అధికారులకు తెలియజేశారు.
ఓబులవారిపల్లె, జూలై 15 : మండల కేంద్రం సమీపంలోని పున్నాటివారి పల్లె వద్ద నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంతో గ్రామానికి ఇబ్బం దులు ఏర్పడతాయని గ్రామస్థులు రైల్వే అధికారులకు తెలియజేశారు. అండర్‌బ్రిడ్జికి అనుసంధానంగా ఏర్పా టు చేసే మరో బ్రిడ్జి వల్ల గ్రామానికి దారి సమస్యతోపాటు, డ్రైనేజీ సమస్య కూడా ఉత్పన్నం అవుతుందని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పనులు అడ్డుకుం టామని గ్రామస్థులు హెచ్చరించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తా మని రైల్వే అదికారులుహామీ ఇవ్వడంతో వార శాంతించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పున్నాటి వాసుదేవరెడ్డి, పున్నాటి ఈశ్వర్‌రెడ్డి, టంగుటూ రు రాజశేఖర్‌రెడ్డి, ఓబిలి భూపతిగారి రవీంద్రారెడ్డి, నందలూరు సుబ్బారెడ్డి, సుబ్రమ ణ్యంరెడ్డి, పుల్లారెడ్డి, టి.శివారెడ్డి, కోవూరు రామయ్య, మునిరెడ్డి, ఓబిలి సుబ్బారెడ్డి, పి.క్రిష్ణారెడ్డి, నాగిరెడ్డి, జి.ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.