Share News

వైసీపీ నాయకుల ఆదేశం.. ఆర్పీల అత్యుత్సాహం

ABN , Publish Date - Jan 30 , 2024 | 11:02 PM

స్థానిక మున్సిపల్‌ గ్రౌండ్‌ సమీపంలోని స్కౌట్‌ హాలులో మంగళవారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించారు.

వైసీపీ నాయకుల ఆదేశం.. ఆర్పీల అత్యుత్సాహం
గేట్లు మూసివేసి డ్వాక్రా మహిళలను నిర్బంధిస్తున్న ఆర్పీలు

కడప (చిన్నచౌకు), జనవరి 30 : స్థానిక మున్సిపల్‌ గ్రౌండ్‌ సమీపంలోని స్కౌట్‌ హాలులో మంగళవారం నిర్వహించిన వైఎస్‌ఆర్‌ ఆసరా నాలుగో విడత కార్యక్రమానికి డ్వాక్రా మహిళలను పెద్ద ఎత్తున తరలించారు. కూర్చోనడానికి కుర్చీలు, కనీస వసతులు లేక పోవడంతో ఎండ తీవ్రత తట్టుకోలేక మహిళలు ఇంటి బాట పట్టారు. దీంతో వారిని అడ్డుకోవాలని వైసీపీ నాయకులు ఆదేశించడంతో కొంత మంది ఆర్పీలు అత్యుత్సాహంతో గేట్లు మూిసివేశారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక డ్వాక్రా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటికి పంపించండి, దాహం వేస్తోంది అని ఎంత వేడు కున్నా కనికరించకుండా డ్వాక్రా మహిళలపై ఆర్పీలు జులుం ప్రదర్శించారు.

వల్లూరు: మండలంలోని 560 స్వయం సహాయక సంఘాలకు వైఎస్‌ఆర్‌ ఆసరా ద్వారా 5,00,37,174 రూపాయలను ఆర్ధిక సాయం అందించినట్లు ఎమ్మెల్యే రవీంద్రనాఽథరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక మోడల్‌ స్కూలులో ఆర్టీసీ ఛైర్మన్‌ దుగ్గాయపల్లె మల్లికార్జున రెడ్డితో కలిసి ఇందుకు సంబంధించిన చెక్కును అందజేశారు. ఎంపీ డీవో జయశ్రీ, జడ్పీటీసీ సభ్యుడు వెంకటసుబ్బయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు వీరారెడ్డి, పంచాయతీ విస్తరణాధికారి ప్రసాద్‌, ఏపీఎం శైలజ తదితర మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకులతో పాటు సచివాలయ సిబ్బంది, డ్వాక్రా సంఘాల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 11:02 PM