Share News

రెచ్చగొట్టే కొద్దీ ఉద్యమిస్తాం..

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:14 PM

కనీస వేతనాల కోసం శాంతియుతంగా తాము సమ్మె చేస్తుండగా, ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోందని వాల్మీకిపురంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశశరు

రెచ్చగొట్టే కొద్దీ ఉద్యమిస్తాం..
తంబళ్లపల్లెలో నిరసన వ్యక్తం చేస్తున్న అంగనవాడీ కార్యకర్తలు

వాల్మీకిపురం, జనవరి 17: కనీస వేతనాల కోసం శాంతియుతంగా తాము సమ్మె చేస్తుండగా, ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోందని వాల్మీకిపురంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశశరు. బుధవారం స్థానిక ఐసీడీఎస్‌ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట తమ షోకాజ్‌ నోటీసుల విషయమై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలో సీడీపీవో అందుబాటులో లేకపోవడంతో షోకాజ్‌ నోటీసులతో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. వేతనాల సమస్య తీర్చమంటే షోకాజ్‌ నోటీసులు ఇస్తారా.. దేనికీ బెదరం. మా సత్తా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మా బతుకులు బాగుపడొద్దా.. మా కుటుంబా లు గడ్డి తినాలా అంటూ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సీఎం దిగివచ్చి సమస్యలు పరిష్కరించని పక్షంలో సమ్మె తీవ్ర స్థాయికి చేరు తుందన్నారు. అనంతరం స్థానిక ప్రాజెక్టు కార్యా లయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన లీడ ర్లు చంద్రావతి, భూకైలేశ్వరి, ప్రసన్న, అమ్మాజీ, లక్ష్మీన రసమ్మ, దేవసేన, రెడ్డిరాణి, గుర్రంకొండ, కలికిరి, వాల్మీకిపురం అంగన్వాడీ కార ్యకర్తలు, హెల్పర్లు, మినీ వర్కర్లు పాల్గొన్నారు.

తంబళ్లపల్లె: మూడు రోడ్ల కూడలిలో శిబిరం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. తంబళ్లపల్లె, కురబలకోట, పెద్దమండ్యం మండలాల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్తు పాల్గొన్నారు.

బి.కొత్తకోట: స్థానిక దీక్షా శిబిరం వద్ద అన్నమయ్య జిల్లా అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన నేత రాజేశ్వరి మాట్లాడుతూ ఏ చట్టం ప్రకారం అంగన్వాడీలను తీసివేస్తారని ప్రశ్నించారు. విధుల్లో చేరాలంటూ ఐసిడిఎస్‌ సిబ్బంది పంపిన నోటీసులకు ప్రతి ఒక్క కార్యకర్త లిఖిత పూర్వకంగా బదులు ఇవ్వాలని తీర్మానించారు. ప్రాజెక్టు యూఇయన నాయకురాలు శ్రీవాణి మాట్లాడుతూ కొత్తగా ఉద్యోగాలు వచ్చిన వారుసమ్మెలో పాల్గొనకూడదని బెదిరించారన్నారు. బలవంతంగా విధుల్లో చేరిన వారిని సైతం సమ్మెలో పాల్గొనే విధంగా యూనియన తరపున చర్యలు తీసుకుం టామన్నారు. జీతాలు పెంచినట్లు ప్రకటించేవరకు ధర్నా కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బి.కొత్తకోట, మొలకలచెరువు, పీటీఎం కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:14 PM