ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ ధ్యేయం
ABN , Publish Date - Apr 03 , 2024 | 10:47 PM
ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ ధ్యేయం అని ఉమ్మడి టీడీపీ అభ్యర్థి షాజహాన్‌బాషా తెలిపారు. బుధవారం మండలంలోని రాచవేటివారిపల్లి పంచాయతీలో ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ అమలు చేయనున్న సూపర్‌సిక్స్ ఫథకాలపై ప్రజలకు వివరించారు.

నిమ్మనపల్లి, ఏప్రిల్ 3: ప్రజా సమస్యల పరిష్కారమే టీడీపీ ధ్యేయం అని ఉమ్మడి టీడీపీ అభ్యర్థి షాజహాన్‌బాషా తెలిపారు. బుధవారం మండలంలోని రాచవేటివారిపల్లి పంచాయతీలో ఇంటింటికీ తిరుగుతూ టీడీపీ అమలు చేయనున్న సూపర్‌సిక్స్ ఫథకాలపై ప్రజలకు వివరించారు. అనంతరం నిర్వహిం చిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే ు రూ.4వేలు పింఛన్, అర్టీసీ బస్సుల్లో మహిళల కు ఉచిత ప్రయాణం, నెలకు రూ.1500, ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు, విద్యార్థులకు రూ.15 వేలతో పాటు, బీసీలకు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి రూ.20 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం సామాన్యుల జీవితాలను అతలాకుతులం చేసి,ౖ అన్యా యంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసిందన్నారు. వలంటీర్ల ద్వారా ఫించన్‌లు పంపిణీ చేయకూడదని ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధిస్తే దానికి కారణం చంద్రబాబు అని చెప్పడం దారుణమన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ప్రజలు గమనిస్తున్నారని జగన్‌కు గుణ పాఠం చేప్పే సమయం అసన్నమైందన్నారు. మే13న జరిగే ఎన్నికల్లో వైసీపీని తగిన గుణపాఠం చెప్పి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్జే వెంకటేష్, రాజన్న, నవీన్, శ్రీపతి, శ్రీనివాసులు, భాస్కర, రవి, మల్లప్ప, రెడ్డెప్ప, జయన్న తదితరులు పాల్గొన్నారు.
మదనపల్లె టౌన్,: మదనపల్లె టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థి షాజహాన్‌బాషా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బుధవారం మండలంలోని డ్రైవర్స్ కాలనీ,, కురవంక పంచాయతీల్లో ఇంటింటికి తిరుగు తూ చంద్రబాబు ప్రకటించిన సూపర్‌సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతారని లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెల్లె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.