Share News

భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 12:21 AM

రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని మదనపల్లె బార్‌ అసోసియేషన సభ్యులు డిమాండ్‌ చేశారు.

భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలి

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 5: రాష్ట్రంలో ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని మదనపల్లె బార్‌ అసోసియేషన సభ్యులు డిమాండ్‌ చేశారు. సోమ వారం స్థానిక బార్‌ అసోసియేషన కార్యాలయంకు తాళంవేసి, నోటికి నల్ల రిబ్బను కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చట్టం వలన రైతులు, భూ యజమానులు తీవ్రంగా నష్టపోతారన్నారు. నాలుగు నెలలుగా న్యాయవాదులు నిరసనలు తెలుపుతున్నా ప్రభు త్వం పట్టింకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయబద్దంగా వచ్చే ఆస్థిహ క్కు మాయమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన అధ్యక్షుడు జనా ర్థనరెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోహర్‌, నరేంద్ర, గణపతి, శివకుమార్‌రెడ్డి, వెంకట్‌కుమార్‌, ప్రసాద్‌, శ్రీనివాసులు, లక్ష్మీకాంత, శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 12:21 AM