Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పోలియో రహిత సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Mar 04 , 2024 | 12:45 AM

పోలియో రహిత సమాజమే లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. రెండు పోలియో చుక్కలు చిన్నారుల నిండు జీవితానికి రక్ష అని ఆర్డీవో హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

పోలియో రహిత సమాజమే లక్ష్యం
చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్న ఆర్డీవో హరిప్రసాద్‌

మదనపల్లె/టౌన/అర్బన, మార్చి 3: పోలియో రహిత సమాజమే లక్ష్యమని వక్తలు పేర్కొన్నారు. రెండు పోలియో చుక్కలు చిన్నారుల నిండు జీవితానికి రక్ష అని ఆర్డీవో హరిప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివా రం పల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా స్థానిక రామారావు హై స్కూల్‌ వద్ద ఆర్డీవో హరిప్రసాద్‌ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు పోలి యో సోకితే జీవితాంతం అంగవైకల్యంతో అవస్థలు పడేవారని, ప్రభు త్వాలు పోలియో వ్యాధిని తుడిచి పెట్టేందుకు పోలియో వాక్సిన కని పెట్టి 0-6 ఏళ్ల వయస్సు ఉన్న చిన్నారులకు వేయిస్తున్నారన్నారు. డిప్యూటీ డీఎంహెచవో డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ మదనపల్లె డివి జనలో 497 కేంద్రాల వద్ద వైద్య, ఆరోగ్య సిబ్బంది చిన్నారులకు పోలి యో చుక్కలు వేశారన్నారు. మొత్తం మదనపల్లె డివిజనలో 87,179 మంది చిన్నారులకు గాను సాయంత్రానికి 86,276 మందికి పోలియో చుక్కలు వేసి 99శాతం సాధించామన్నారు. మదనపల్లె పట్టణంలో 67 చోట్ల పోలియో సెంటర్లు ఏర్పాటుచేశామని ఆర్టీసీ బస్టాండు, సీటీఎం రైల్వేస్టేషన, మున్సిపల్‌ కార్యాలయం అంగనవాడీ కేంద్రాల వద్ద చిన్నారులకు పోలియో చుక్కలు వేశామన్నారు. కాగా ఈశ్వరమ్మకాలని లో మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా, కురవంక గ్రామ సచివాలయం వద్ద సర్పంచ చిప్పిలి చలపతి చిన్నారులకు పోలియో చుక్కలువేశారు.

స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన వి.మనూజ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీవైస్‌చైర్మన ఎన.ఇర్ఫానఖాన, పిపి యూనిట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ గంగాభవానీ, డాక్టర్‌ గాయత్రి, మున్సిపల్‌ ఏఎస్‌వో వెంకటేశ్వర్లు నాయుడు, శానిటరీ ఇనస్పెక్టర్‌ శివయ్య, కౌన్సిలర్‌ ఎస్‌.ముబీన, ప్రసా ద్‌ బాబు, తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంగ్రెస్‌ పార్టీ రాజంపేట పార్లమెంట్‌ నాయకు డు, పుంగనూరు కన్వీనర్‌ సింగం రామకృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలను వేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శ్రీదేవి, ఈశ్వర్‌, పవనకుమారెడ్డి, సైదాని, రామకృష్ణ పాల్గొన్నారు. అలాగే మదనపల్లె యూత అధ్యక్షుడు ఏఆర్‌ సురేష్‌ కరాటే అసోసియేషన ఆధ్వర్యంలో పల్స్‌ పోలియా సందర్భంగా ర్యాలీని నిర్వహించారు.

గుర్రంకొండలో:చిన్నారులకు ఫల్స్‌పోలియో సోకకుండా చూడడమే లక్ష్యమని డీఎంహెచవో కొండయ్య అన్నారు. ఫల్స్‌పోలియో కార్యక్ర మంలో భాగంగా ఆదివారం గుర్రంకొండలోని పలు కేంద్రాలను ఆయ న తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రు లు పట్టిన పిల్లల నుంచి 5 ఏళ్లలోపు పిల్లలందరికీ ఫల్స్‌పోలియో చుక్కలను వేయించాలన్నారు. అనంతరం గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో గుర్రంకొండ ఆసుపత్రి పరిధిలో 2811 మందికి గాను 2703 మందికి, తరిగొండ ఆసుపత్రిలో పరిధిలో 1956 మందికిగాను 1903 మందికి ఫల్స్‌పోలి యో చుక్కలు వేసినట్లు డాక్టర్లు రవీంద్రనాయక్‌, సులక్షణ తెలిపారు. ఈ రెండు ఆసుపత్రిలో పరిధిలో 96 శాతం పోలియో కార్యక్రమం నమోదైనట్లు తెలిపారు.

కలకడలో:పిల్లలందరికీ ఫల్స్‌పోలియో కార్యక్రమంలో భాగంగా చుక్క లు వేసి లక్ష్యాలను పూర్తి చేయాలని డీఎంహెచవో కొండయ్య సిబ్బం దిని ఆదేశించారు. ఆదివారం ఆయన మండలంలోని కోన, కదిరాయ చెరువులో కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. కాగా ఎర్రకోటపల్లె ఆసుపత్రి పరిధిలో 1829గాను 1809 మందికి, కలకడ ఆసుపత్రి పరిధిలో 2284 గాను 2262 మంది పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు డాక్టర్లు కిషోర్‌కుమార్‌రెడ్డి, మల్లికార్జున, జవహర్‌బాబులు తెలిపారు.

నిమ్మనపల్లిలో: మండలంలో పల్స్‌పోలియో చుక్కల కార్యక్రమం విజయవతంగా ముగిసిట్లు వైద్యాధికారి రమేష్‌బాబు తెలిపారు. ఆది వారం ఆయన మాట్లాడుతూ 0నుంచి 5ఏళ్లలోపు వయస్సు కలిగి చిన్నారులు 3913మంది ఉండగా వారిలో 99శాతం మందికి పల్స్‌పోలి యో చుక్కలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో అంగన్వాడీలు, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది, ఆశాలు, తదితరులు పాల్గొన్నారు.

ములకలచెరువులో: స్ధానిక జడ్పీ హైస్కూల్‌ కేంద్రంలో వైద్యాధికారి ణి రేష్మా బేగం పిల్లకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. మండలంలో మొత్తం 5419 మంది పిల్లకు గానూ 5272 మందికి పోలియో చుక్కలు వేసినట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమా ల్లో సీహెచవోలు షకీలాబేగం, సందీపా పాల్గొన్నారు.

పీలేరులో: మండలంలో ఆదివారం జరిగిన జాతీయ పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. పీలేరు మండలంలో 0-5 ఏళ్లలోపు ఉన్న చిన్నారులు 8361 మంది ఉండగా మండలంలోని తలపుల, రేగళ్లు పీహెచసీల సిబ్బంది 8198(98 శాతం) మందికి చుక్కలు వేశారు. పల్స్‌ పోలియో కార్యక్రమ జిల్లా పరిశీలకులు, ఎండమాలజిస్టు వెంకటేశ పీలేరు, కేవీపల్లె మండలాల్లో పర్యటించి కార్యక్రమాన్ని పరిశీలించారు. పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె, కేవీపల్లె మండలం గుండ్రేవారిపల్లెలో జరిగిన శిబిరాన్ని సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందజేశారు. ఆదివారం చుక్కలు వేయించుకోలేకపోయిన చిన్నారులకు సోమవారం, మంగళవారాల్లో వాళ్ల ఇంటి వద్దనే వేయనున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్ర మం లో వైద్యాధికారులు రమేశ రెడ్డి, చంద్రశేఖర్‌ నాయక్‌, కార్తీక్‌ కుమార్‌, సీహెచవో జయలక్ష్మి, హెచఈలు ఉషారాణి, కొండయ్య, సూపర్‌వైజర్లు కుసుమ, రమాదేవి, చిన్నప్ప, అంగనవాడీ, ఆశాలు పాల్గొన్నారు.

వాల్మీకిపరంలో: పుట్టిన ప్రతి బిడ్డకు తప్పనిసరిగా పోలియో చుక్క లు వేయించాలని డాక్టర్‌ కీర్తి పేర్కొన్నారు. ఆదివారం వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి, నగిరిమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆధ్వర్యంలో పల్స్‌ పోలియో కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 5200మంది పిల్లలకు పల్స్‌ పోలియో చుక్కలు వేసి 96శాతం కార్యక్ర మం విజయవంతమైనట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు శ్రీవిద్య, మహ్మద్‌వసీం, నయీం, సూపర్‌వైజర్‌ సుఽధాకర్‌, ఇందిరారాణి, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: తంబళ్లపల్లె మండలంలో ఆదివారం నిర్వహించిన పల్స్‌ పోలియో కార్యక్రమం విజయవంతమైనట్లు వైద్యాధికారి అను మప తెలిపారు. మండలంలో 33 కేంద్రాలలో 0-5 సంవత్సరాల లోపు చిన్నారులు 4727 మంది లక్ష్యం కాగా 4718 మందికి 99.8 శాతం మొదటి రోజు పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఏఎనఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కలికిరిలో: మండలంలో ఏర్పాటు చేసిన 35 కేంద్రాల్లో ఆదివారం 5753 మంది చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు మేడికుర్తి వైద్యాధికారి డాక్టర్‌ చిన్నరెడ్డెప్ప తెలిపారు. మొత్తం 5849 మంది పిల్లలు అర్హులు కాగా 98 శాతం మందికి పూర్తి చేశామన్నారు. మిగి లిన వారందరికీ సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి పూర్తి చేయ నున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్‌ చిన్నరె డ్డెప్ప, డాక్టర్‌ కావ్యగంధ, హెచఎస్‌ హేమలత, ఏఎనఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

పెద్దమండ్యంలో:మండలంలో 4020 మంది చిన్నారులకు పల్స్‌పోలి యో చుక్కలు వేసినట్లు పీహెచసీ డాక్టర్లు ఇమ్మానుయోల్‌, హరివర్మ తెలిపారు. 30 పల్స్‌పోలియో కేందాల్లో 130 మంది వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగనవాడీ కార్యకర్తలు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామా ల్లో పల్స్‌ పోలియో చుక్కలు వేయించుకోని వరి కోసం ఈ కార్యక్రమం మరో రెండు రోజులు కొసాగిస్తామన్నారు. ఎంపీపీ పూర్ణచంద్రిక రమే ష్‌, జడ్పీటీసీ పీరమ్మ, పీహెచసీ సీహెచవో క్రిష్ణయ్య పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలోని బి.కొ త్తకోట, పీటీఎం మండలాలకు సంబందించిన 5 సంవత్సరాల పిల్లలకు 10621 మందికి అంగనవాడీ వర్కర్లు, ఆరోగ్య కార్యకర్తలు పల్స్‌ పోలి యో చుక్కలు వేశారు. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలను వేశారు. మండల అధికారులు, వైద్యసి బ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 04 , 2024 | 12:45 AM