Share News

మోదీ ఆధ్వర్యంలో దేశం పురోగతి

ABN , Publish Date - Feb 26 , 2024 | 11:20 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాలలో పురోగతి సాధిస్తోందని రైల్వే జడ్‌ఆర్‌యూ సీసీ మాజీ మెంబర్‌ దేవగుడి శివనారాయణరెడ్డి తెలిపారు.

మోదీ ఆధ్వర్యంలో దేశం పురోగతి
రైల్వే అండర్‌బ్రిడ్జి ప్రారంభిస్తున్న దేవగుడి శివనారాయణరెడ్డి

కొండాపురం, ఫిబ్రవరి 26: ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాలలో పురోగతి సాధిస్తోందని రైల్వే జడ్‌ఆర్‌యూ సీసీ మాజీ మెంబర్‌ దేవగుడి శివనారాయణరెడ్డి తెలిపారు.అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా సోమవారం రూ.41 వేల కోట్లతో దేశ వ్యాప్తంగా ప్రధాని మోదీ 554 రైల్వేస్టేషన్‌ల అభివృద్ధి, 500 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ పనులను వర్చువల్‌గా ప్రారంభించారు. అందులో భాగంగా మండలంలోని దత్తాపురం గ్రామం వద్ద నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జిని ఆయన ప్రారంభించారు. విమానాశ్రయాలకు దీటుగా కేంద్రప్రభుత్వం రైల్వేస్టేషన్‌లను అభివృద్ది చేస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు నరసింహారెడ్డి, ప్రశాంత్‌, బీజేపీ నాయకులు శంకర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి మాజీ సర్పంచ్‌ శ్రీరంగనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 11:20 PM