Share News

అధినేతకు అంతా తెలుసు!

ABN , Publish Date - Jun 08 , 2024 | 10:52 PM

నియోజక వర్గంలో టీడీపీ ఓటమికి ఎవరు కారకులో పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు బాగా తెలుసని, ఎన్నికల ముందే ఈ విషయాన్ని పరిశీలించి, ముందస్తు హెచ్చరికలు జారీ చేశారని, తాను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని రాజంపేట టీడీపీ నియోజక వర్గ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నారు.

అధినేతకు అంతా తెలుసు!
మాట్లాడుతున్న టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం

టీడీపీ పరాజయంపై సుగవాసి

రాజంపేటను జిలా ్లకేంద్రం చేసి తీరుతాం

ఇకపై ఇక్కడే స్థిర నివాసం

రాజంపేట, జూన 7: నియోజక వర్గంలో టీడీపీ ఓటమికి ఎవరు కారకులో పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబునాయుడుకు బాగా తెలుసని, ఎన్నికల ముందే ఈ విషయాన్ని పరిశీలించి, ముందస్తు హెచ్చరికలు జారీ చేశారని, తాను ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని రాజంపేట టీడీపీ నియోజక వర్గ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నారు. రాజంపేటలో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను నెల రోజుల ముందే రాజంపేటకు వచ్చానని, కార్యకర్తలు నిజాయితీగా ఎంతో కష్టపడి పని చేసినా, కొన్ని అజ్ఞాత శక్తులు తమ ఓటమికి కారణమయ్యాయన్నారు. ఎవరిపై నిందారారోపణలు చేయడం తనకు చేతకాదన్నారు. విజయం అంచుల వరకు తీసుకువచ్చిన రాజంపేట నియోజక వర్గ కార్యకర్తల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తామని ప్రకటన చేసిన విషయాన్ని అధినేతకు గుర్తు చేసి సాధిస్తా నన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాలు పెరుగుతున్న దృష్ట్యా, జిల్లా కేంద్రంపై స్పష్టమైన ప్రకటన చేశామన్నారు. అన్నమయ్య ప్రాజెక్టును పునరుద్ధరించి, బాధితులకు న్యాయం చేస్తామని, మెడికల్‌ కళాశాలను కూడా తెప్పిస్తామన్నారు. ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానం ఖాళీ కాబో తోందని, ఆ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంటామన్నారు. స్థానిక సంస్థలలో అన్ని స్థానాల్లో టీడీపీ విజయఢంకా మోగించడానికి, నాయకు లందరికీ పదవులు రావడానికి ఇప్పటి నుంచి పాటుపడతా నన్నారు. నియోజకవర్గ బాధ్యుడిగా కార్యకర్తల సమస్యలు పరిష్కరిసా ్తమన్నారు. రాజంపేట నియోజక వర్గ టీడీపీ పరిశీలకుడు దుర్గా ప్రసాద్‌ మాట్లాడు తూ ఓటమిని విజయసోపానంగా భావించి, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత నాయకత్వంపై ఉందన్నారు. ఆర్టీసీ మాజీ చైర్మన యెద్దల సుబ్బరాయుడు, జిల్లా లీగల్‌ అధ్యక్షుడు టి.ల క్ష్మి నారాయణ, గీతాంజలి అధినేత ఎస్‌వి రమణ, మైనార్టీ నాయకులు గుల్జార్‌బాషా, బార్‌ అసోసియేషన మాజీ అధ్యక్షుడు కొండూరు శరత కుమార్‌రాజు సీనియర్‌ న్యాయవాది కృష్ణకుమార్‌, మండల మాజీ ఉపాధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, టీడీపీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి, మండల టీడీపీ అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్యనాయుడు, పట్ట ణ అధ్యక్షుడు మణి, మైనార్టీ నాయకులు అబూబకర్‌, తదితరులు మాట్లా డుతూ నియోజకవర్గంలో పార్టీ అబివృద్దికి, పనులకు శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఆర్టీసీ మాజీ చైర్మన యొద్దల సుబ్బ రాయుడు, జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు టి.ల క్ష్మినారాయణ, గీతాంజలి అధినేత ఎస్‌వి రమణ, మైనార్టీ నాయకులు గుల్జార్‌బాషా, బార్‌ అసోసియేషన మాజీ అధ్యక్షుడు కొండూరు శరతకుమార్‌రాజు సీనియర్‌ న్యాయవాది కృష్ణకుమార్‌, మాజీ మండల ఉపాధ్యక్షులు సుధాకర్‌రెడ్డి, టీడీపీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మల్లెల శ్రీవాణి మండల పార్టీ అధ్యక్షులు గన్నే సుబ్బనరసయ్యనాయుడు, పట్టణ అధ్యక్షులు మణి, మైనార్టీ నాయకులు అబూబకర్‌, తదితరులు మాట్లాడుతూ నియోజక వర్గంలో పార్టీ అబివృద్దికి, పనులకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఆసన్న మైందన్నారు. కావటూరి సుబ్రమణ్యంనాయుడు (మణి) ఆదినారాయణ, పార్లమెంటు ఉపాధ్యక్షురాలు వాణి, పట్టణ మాజీ టీడీపీ అధ్యక్షులు సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 10:52 PM