Share News

రవాణా రంగంపై నల్ల చట్టాన్ని ఉపసంహరించుకోవాలి

ABN , Publish Date - Jan 17 , 2024 | 11:18 PM

రవాణారంగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాన్ని రద్దు చేయాలని మదనపల్లె లారీ, ఐషర్‌ డ్రైవర్‌, క్లీనర్ల అసోసియేషన డిమాండ్‌ చేసింది.

రవాణా రంగంపై నల్ల చట్టాన్ని ఉపసంహరించుకోవాలి
నిరసన తెలుపుతున్న లారీ, ఐషర్‌ డ్రైవర్‌, క్లీనర్‌ అసోసియేషన అధ్యక్షుడు జింకా వెంకటాచలపతి, తదితరులు

మదనపల్లె, జనవరి 17: రవాణారంగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్లచట్టాన్ని రద్దు చేయాలని మదనపల్లె లారీ, ఐషర్‌ డ్రైవర్‌, క్లీనర్ల అసోసియేషన డిమాండ్‌ చేసింది. స్థానిక పుంగనూరురోడ్డులోని వై జంక్షనలో ఏపీ జయహో రథసారఽథి యూనియన పిలుపు మేరకు ఈ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు యూనియన సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆ యూనియన అధ్యక్షుడు, మున్సిపల్‌ వైస్‌చైర్మన జింకా వెంకటాచలపతి మాట్లాడుతూ.. కేంద్రం హిట్‌ అండ్‌ రన నల్లచట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుకోవాలని కోరారు. తమకు వేతనం ఇవ్వాలని, భద్రత కల్పించాలని అడగలేదన్నారు. కేంద్రం మొండివైఖరి వీడకపోతే ఆలిండియా వ్యాప్తంగా లారీ, ఐసర్‌ యూనియన్ల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన కార్యదర్శి మక్బూల్‌, ఉపాధ్యక్షుడు చంద్ర, బాబు, అక్బర్‌, రియాజ్‌, ఆదం, షబ్బీర్‌, ఖాదం, షరీఫ్‌, మల్లి, ఫరీద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 17 , 2024 | 11:18 PM