Share News

వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలి

ABN , Publish Date - Mar 01 , 2024 | 10:44 PM

అరాచకంగా వ్యవహ రిస్తున్న వైసీపీ ప్రభు త్వాన్ని ఇంటికి సాగ నంపాలని భారతీయ జ నతా పార్టీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి పోతుంట రమేశ్‌నాయుడు అన్నారు

 వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలి
మాట్లాడుతున్న పోతుగుంట రమేశ్‌నాయుడు

రాయచోటిటౌన్‌, మార్చి 1: అరాచకంగా వ్యవహ రిస్తున్న వైసీపీ ప్రభు త్వాన్ని ఇంటికి సాగ నంపాలని భారతీయ జ నతా పార్టీ రాష్ట్ర కార్య వర్గ సభ్యుడు, నంద్యాల జిల్లా ఇన్‌చార్జి పోతుంట రమేశ్‌నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన రాయచోటికి వచ్చిన సందర్భంగా బీజేపీ నేతలతో కలిసి మీడియా తో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ వైసీపీ పాలన అంతమొం దించేందుకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, రాష్ట్ర ప్రజలు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు. అన్నమయ్య జిల్లా పార్లమెంట్‌ సభ్యులకు రెండు పర్యాయాలు అవకాశం కల్పించినా ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి పనిచేయకపోగా మరొకసారి అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలను ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎంపీ మిథున్‌రె డ్డి రాజంపేట పార్లమెంట్‌కు పట్టిన దరిద్రమంటూ ఈ ప్రాంత ప్రజలు భావిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆయనను ఇంటికి సాగనంప డానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సీనియర్‌ నేత శివగంగిరెడ్డి మాట్లాడుతూ రాయచోటి ప్రాంతం పేరుకే జిల్లా అయ్యింది కానీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఈ ప్రాంత ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ కోసం కేటాయించిన రూ.376 కోట్ల నిధులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోవడంతో నిధులు తిరిగి వెళ్లిపోయాయ న్నారు. రాయచోటిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జానం బాలాజీ యాదవ్‌, జిల్లా కార్యదర్శి గుండ్లపల్లి వెంకటేశ్‌, మాదా రమేశ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఓం ప్రసాద్‌యాదవ్‌, బీజేవైఎం కడప జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్‌కుమార్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గసభ్యులు వెంకట్రామరాజు, జయచంద్ర తదితర నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 10:44 PM