Share News

టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:53 PM

ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌ పేర్కొన్నారు.

టీడీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలి
బి.కొత్తకోటలో జయహో బీసీ సదస్సులో డిక్లరేషన కరపత్రాలు చూపుతున్న నాయకులు

బి.కొత్తకోట, ఏప్రిల్‌16: ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌ పేర్కొన్నారు. మంగళవారం బి.కొత్తకోట మం డలంలోని గుమ్మసముద్రం, బడికాయలపల్లిలలో బీసీ సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల సంక్షేమం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన బీసీ డిక్లరే షన ఎంతగానో తోడ్పడుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలలో బీసీలకు 34 శాతం వున్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిందని ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధిచెప్పాలని కోరారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలకు 50 ఏళ్లకే రూ.4వేలు పింఛన ఇస్తామని, సబ్‌ప్లాన , చంద్రన్న భీమా ద్వారా బీసీలకు అండగా ఉం టామన్నారు. కార్యక్రమంలో బీసీసెల్‌ జిల్లా అధ్యక్షుడు సురేంద్రయా దవ్‌, మండల కన్వీనర్‌ నారాయణస్వామిరెడ్డి, ప్రసాద్‌, నారా యణ, బంగారువెంకట్రమణ, గంజిమోహన, మనోహర్‌నాయుడు, రవికుమా ర్‌, గోవిందు, ఓబులేసు, శిల్పాఅంజి, కిట్టన్న, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

టీడీపీకి బీసీలే పట్టుకొమ్మలు...

నిమ్మనపల్లి, ఏప్రిల్‌ 16: టీడీపీకి బీసీలే పట్టుకొమ్మలని బీసీ నాయ కుడు, మాజీ సర్పంచ రమణ పేర్కొన్నారు. మంగళవారం ముష్టూరు పంచాయతి వలసపల్లి జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాని ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్‌ మాట్లాడూతూ బీసీలకు చట్ట సభలలో ప్రాముఖ్యత కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం బీసీల కొరకు టీడీపీ 50ఏళ్లకే పింఛనను ప్రవేశపెట్టిదన్నారు. మే13న జరిగే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పి మదనపల్లె ఎమ్మెల్యేగా షాజహానబాషాకు సైకిల్‌ గుర్తుకు, రాజంపేట ఎంపీగా కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాజన్న, శ్రీపతి, రఫి, రెడ్డెప్ప, జయన్న, మల్లికార్జున, రెడ్డెప్ప, రమణ, షపీ, ఖాసింమ్‌ఖాన, అప్రోజ్‌, జయన్న, రామకృష్ణ, నరేంద్ర పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: మండలంలోని మద్దయ్యగారిపల్లె పంచా యతీ కుమ్మరవారిపల్లెలో టీడీపీ నాయకులు బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాల్లోని సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి ్జకరపత్రాలను టీడీపీ నాయకులు అందించారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకోస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చంద్రశేఖ ర్‌ (చిన్నా), సీనియర్‌ టీడీపీ నాయకులు బందార్ల వెంకట్రమణ, కార్యం సుబ్రమణ్యం, పాలగిరి రామాంజులు, పట్టెం చిన్నరెడ్డెప్ప, పట్టెం సుబ్బరాయప్ప, పట్టెం పెద్దరెడ్డెప్ప, ఓబులేసు, ఆదినారాయణ, రామచంద్ర, నరసింహులు, రాము, మస్తాన పాల్గొన్నారు.

కలకడలో:గ్రామాల్లో కనీస వసతుల కల్పన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు. మంగళవారం కలకడ మండల టీడీపీ అధ్యక్షుడు పొత్తూరి ప్రభాకర్‌నాయుడు ఆధ్వర్యంలో బాబుష్యూరిటీ-భవిష్యత గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈసం దర్భంగా బాటవారిపల్లె పంచాయతీ గరుడప్పగారిపల్లె, కొత్తగాండ్లప ల్లె, ఆంజినేయవడ్డిపల్లె, బీసీ, ఎస్సీకాలనీలో ఇంటింటికి వెళ్లి కరప త్రాలను అందజేశారు. రాజంపేట పార్లమెంట్‌ కూటమి ఉమ్మడి అఽభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీలేరు నియోజకవర్గ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిలను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మల్లారపు రవిప్రకాశ, రాష్ట్ర అధికా ర ప్రతినిధి సూర్యప్రకాశ, నాయకులు బరకం శ్రీనివాసులరెడ్డి, బీజేపీ కన్వీనర్‌ పొత్తూరి శ్రీకాంత, రమణ, మల్లికార్జుననాయుడు, కాంతా రావు, విశ్వనాథ్‌, ఆర్‌. రమణ, సరస్వతమ్మ, తారకేశ్వర, చంద్ర మో హన, త్యాగరాజు, మల్లికార్జుననాయుడు, వెంకటరత్నం, చంద్రబాబు నాయుడు, శ్రీనివాసులరెడ్డి, ధనుంజయులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:53 PM