Share News

బీసీల సమగ్రాభివృద్ద్ధే టీడీపీ లక్ష్యం

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:29 AM

రాష్ట్రంలో బీసీల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పే ర్కొన్నారు. ఆ

బీసీల సమగ్రాభివృద్ద్ధే టీడీపీ లక్ష్యం
జయహో బీసీ రథయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిశోర్‌కుమార్‌

ఫ జయహో బీసీ రథం ప్రారంభోత్సవంలో నల్లారి కిశోర్‌

మదనపల్లె టౌన, జనవరి 7: రాష్ట్రంలో బీసీల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి పే ర్కొన్నారు. ఆదివారం స్థానిక రాజంపేట పార్లమెంట్‌ టీడీపీ కార్యాలయంలో బీసీ విభాగం అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌ ఆధ్వ ర్యంలో జయహో బీసీ యాత్ర రథాన్ని కిశో ర్‌కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు నుంచి చం ద్రబాబు వరకు బీసీల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారన్నారు. రాష్ట్రంలో వైసీపీ పాలనలో బీసీలపై దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యా యన్నారు. ఇదే బీసీలకు రక్షణగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి తరహాలో బీసీ అట్రాసిటి చట్టం తీసుకొచ్చేందుకు నారా లోకేశ యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చారన్నారు. . మాజీ ఎమ్మెల్యే షాజహానబాషా, రాయచోటి టీడీపీ నాయకుడు మండిపల్లె రాంప్రసాద్‌రెడ్డి, పార్లమెంట్‌ బీసీ విభాగం అధ్యక్షుడు పి.సురేంద్రయాదవ్‌ మాట్లాడుతూ పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాల్లో షెడ్యూల్‌ ప్రకారం ప్రతి మండలంలో జయహో బీసీ యాత్ర రథాలు తిరుగుతాయన్నారు. చంద్రబాబు అధికారంలో బీసీల అభివృద్ధి, వైసీపీ పాలనలో బీసీల అథోగతిపై ప్రచారం చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి దొరస్వామినాయుడు, పఠాన ఖాదర్‌ఖాన, సర్పంచ ప్రభాకర్‌, బీసీ ప్రధాన కార్యదర్శి రెడ్డెప్ప, సాధాకర కమిటీ కన్వీనర్లు వెంకటరమణ, లక్ష్మన్న, జనార్ధన, రామ్మూర్తి, నారా యణ, దుర్గాప్రసాద్‌, వేణుగోపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:29 AM