రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమే..
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:19 AM
రాబోయే ఎన్నికల్లో ప్రజాశీస్సులతో అధికారం లోకి రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని రాజంపేట పార్లమెం టరీ ఉపాధ్యక్షుడు శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు.
తంబళ్లపల్లె, ఫిబ్రవరి 5: రాబోయే ఎన్నికల్లో ప్రజాశీస్సులతో అధికారం లోకి రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వమేనని రాజంపేట పార్లమెం టరీ ఉపాధ్యక్షుడు శివకుమార్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం మం డలంలోని ఎల్లప్పవారికోటలో వారి స్వగృహంలో టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు తిరిగి మళ్లీ సీఎం కావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సోముశేఖర్, సిద్దమల్‌రెడ్డి, క్రిష్ణారెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.