టీడీపీ గెలుపు కోసం సైనికుల్లా పని చేయాలి
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:49 PM
టీడీపీ గెలుపు కోసం టీడీ పీ-జనసేన పార్టీల నాయ కులు, కార్యకర్తలు సైనికు ల్లాగా పని చేయాలని తంబళ్లపల్లి టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రరెడ్డి పిలుపు నిచ్చారు.
పెద్దమండ్యం, మార్చి 1: టీడీపీ గెలుపు కోసం టీడీ పీ-జనసేన పార్టీల నాయ కులు, కార్యకర్తలు సైనికు ల్లాగా పని చేయాలని తంబళ్లపల్లి టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రరెడ్డి పిలుపు నిచ్చారు. పెద్దమండ్యంలో శుక్రవారం జయచంద్రరెడ్డి పర్య టించారు. ఈ సందర్భంగా కార్యకర్తల సమావేశంలో జయచంద్రరెడ్డి మాట్లాడుతూ హంద్రీ-నీవా కాలువల ద్వారా తంబళ్లపల్లి నియోజక వర్గంలోని అన్ని చెరువులకు నీటిని నింపుతామన్నారు. తంబళ్లపల్లిలో టీడీపీ జనసేన పార్టీల జండా ఎగరవేయాలన్నారు. రాష్ట్ర టీడీపీ కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్‌ఎం పర్వీనతాజ్, జిల్లా టీడీపీ బీసీ అధ్యక్షుడు సురేంద్రయాదవ్, నాయకులు సిద్దవరం ప్రసాద్, హసీంసాబ్, గంగా ధర, వేణుగోపాల్‌రెడ్డి, దత్తాత్రేయరెడ్డి, రామకృష్ణరెడ్డి, బాబురెడ్డి, చలప తి, రామాంజులునాయుడు, బాబురెడ్డి, అమరనాధ, సాంబ, శేషాద్రి, సయ్యద్ షావలి, భాస్కర్‌నాయుడు, కువైట్ శంకర్, నియోజ వర్గం జనసేన ఇనచార్జ్ సాయినాధ, శంకర, ఆనంద, శ్రీనాధ పాల్గొన్నారు.