Share News

బీసీలు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి

ABN , Publish Date - Apr 12 , 2024 | 11:51 PM

రాష్ట్రంలో బీసీలు బాగుప డాలి అంటే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శి పర్వీనతాజ్‌ పేర్కొన్నారు.

బీసీలు బాగుపడాలంటే టీడీపీ అధికారంలోకి రావాలి
జయహో బీసీ సమావేశంలో మాట్లాడుతున్న పర్వీనతాజ్‌

బి.కొత్తకోట, ఏప్రిల్‌12: రాష్ట్రంలో బీసీలు బాగుప డాలి అంటే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యద ర్శి పర్వీనతాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం బి. కొత్త కోట మండలంలోని బీరంగి, గుడిపల్లి పంచా యతీలలో జయహో బీసీ కార్యక్రమం మండల పార్టీ కన్వీనర్‌ నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లా డుతూ టీడీపీ అధినే త చంద్రబాబు బీసీ డిక్లరేష న ద్వారా 50 ఏళ్లకే రూ.4వేలు పింఛను, బీసీ సబ్‌ప్లాన ద్వారా ఐదేళ్లలో లక్షన్నరకోట్లు ఖర్చు, రూ.10లక్షల చంద్రన్న బీమా హామీలను ఇవ్వడం జరిగింద న్నారు. అసెంబ్లీ అభ్యర్థిగా జయచం ద్రారెడ్డిని, రాజంపేట పార్లమెంటు అభ్యర్ధిగా కిరణ్‌కుమార్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో క్లస్టర్‌ఇనచార్జి కనకంటి ప్రసాద్‌, నాయకులు గంజి మోహన, డేరింగులనారా యణ, చావిడికిట్టన్న, ప్రభాకర్‌, షఫీవుల్లా, రెడ్డిపీర్‌,గోపినాథ్‌, శ్రీరాములు మొటుకుశివ, రెడెప్ప పాల్గొన్నారు.

బీసీల సంక్షేమమే చంద్రబాబు ధ్యేయం

కురబలకోట, ఏప్రిల్‌ 12: బీసీల సంక్షేమమే టీడీపీ అధినేత చంద్రబాబు ధ్యేయమని రాజం పేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేం ద్రయాదవ్‌ పేర్కొన్నారు. శుక్రవారం మండలం లోని పులగూరవాండ్లపల్లె, తుంగవారిపల్లె తది తర గ్రామాల్లో ఆయన పర్యటించి ఇంటింటా ప్రచారంతో పాటుగా జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ స్థానిక సంస్థలలో బీసీల రిజర్వేషనను వైసీపీ ప్రభుత్వం తగ్గించిందని దానిని మళ్లీ పెంచి బీసీ లకు న్యాయం చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేసి టీడీపీ గెలుపునకు పాటుప డాలన్నారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ బీసీ సెల్‌ అధ్యక్షుడు సురేంద్రయాదవ్‌, మండల కన్వీనర్‌ వై.జి.సురేంద్ర, మాజీ ఎంపీపీ తిమ్మరాయుడు, వెంకటరమణారెడ్డి, వెంకటశివ, రమణ, నరసింహులు, రమణ, గోపాలకృష్ణ, సదాశివ, తెట్టు ఉపసర్పంచ భాస్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2024 | 11:51 PM