పోలీసుగేమ్స్‌లో ప్రతిభ చాటిన కల్పన
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:07 PM
పోలీసు గేమ్స్‌లో పోరుమామిళ్ల వాసి, ఆర్‌ఎస్‌ఐ కల్పన డీజీపీ ద్వారకా తిరుమలరావు నుంచి పతకాలు అందుకుంది.

డీజీపీ నుంచి అందుకున్న పతకాలు
పోరుమామిళ్ల, జులై 5: పోలీసు గేమ్స్‌లో పోరుమామిళ్ల వాసి, ఆర్‌ఎస్‌ఐ కల్పన డీజీపీ ద్వారకా తిరుమలరావు నుంచి పతకాలు అందుకుంది. ఇటీవల అస్సాం రాష్ట్రం గౌహతీ నగరంలో జరిగిన 9వ ఆలిండియా పోలీసు జూడో క్లస్టర్స్‌లో ఏపీ పోలీసు డిపార్ట్‌మెం ట్ తరపున కర్నూలు జిల్లాలో ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న కల్పన తైక్వాండో, కరాటే, సెన్‌కార్ట్, శిలాగ్ గేమ్స్‌లో రెండు పతకాలు సాధించింది. పోరుమామిళ్ల వాసి ప్రస్తుతం ప్రొద్దు టూరు ట్రాఫిక్ స్టేషన్‌లో పనిచేస్తున్న బాషా టీం కోచ్‌గా వ్యవహరించడం, రెండు పత కాలు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. కల్పన ద్వారక తిరుమలరావు నుంచి పత కాలు అందుకున్నందుకు పోరుమామిళ్ల ప్రాంతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.