Share News

గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ తరగతులు

ABN , Publish Date - May 19 , 2024 | 09:39 PM

స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి సూర్యనారాయణరెడ్డి తెలిపారు.

గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ తరగతులు
గ్రంథాలయంలో మాట్లాడుతున్న మురళీకృష్ణ

రామాపురం, మే19: స్థానిక శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ అధికారి సూర్యనారాయణరెడ్డి తెలిపారు. వేసవి సెలవుల్లో విద్యార్థులు సమయం వృఽథా చేసుకోకుండా గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. గ్రంథాలయాల్లో మ్యాగజైన్లు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నా యన్నారు. పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానాన్ని పెంపొందిం చుకోవచ్చున న్నారు. క్యారమ్‌ బోర్డు, చెస్‌ అందుబాటులో ఉన్నా యని తెలిపారు. జూన 7వ తేదీ వరకు జరిగే వేసవి శిక్షణ తరగతులకు మంచి స్పందన వస్తున్నదని, ప్రతి రోజు విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి తమ విలువైన సమయాన్ని పుస్తకాలకు కేటాయిస్తున్నారన్నారు.

రైల్వేకోడూరు: విజ్ఞానం పొందాలంటే పిల్లలు గ్రంథాల యం రావాలని ప్రభుత్వ జడ్పీ హైస్కూలు ఉపాధ్యాయులు మురళీకృష్ణ తెలిపారు. ఆది వారం రైల్వేకోడూరు గ్రంథాల యంలో అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సమ్మర్‌ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారు ్థలకు మంచి విజ్ఞానం కలగాలంటే గ్రంథాలయాలకు వచ్చి అక్కడ ఉన్న పుస్తకాలను చదవాలన్నారు.

Updated Date - May 19 , 2024 | 09:39 PM