Share News

రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలి

ABN , Publish Date - Jun 02 , 2024 | 09:44 PM

రాష్ట్రంలో వ్యవ సాయ సీజనకు అనుగుణంగా వ్యవసా య శాఖ అధికారులు స్పందించి రైతుల కు సరిపడా పత్తి, వేరుశనగ, వరి విత్త నాలు, ఎరువులు, జీలుగలు మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం అన్నమ య్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి కోరారు.

రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలి
మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రంగారెడ్డి

గాలివీడు, జూన 2: రాష్ట్రంలో వ్యవ సాయ సీజనకు అనుగుణంగా వ్యవసా య శాఖ అధికారులు స్పందించి రైతుల కు సరిపడా పత్తి, వేరుశనగ, వరి విత్త నాలు, ఎరువులు, జీలుగలు మంజూరు చేయాలని ఏపీ రైతు సంఘం అన్నమ య్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి కోరారు. ఆదివారం గాలివీడు మండలంలో పర్యటించిన ఆయన రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయించకుండా అధికారు లు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైతులం దరికీ రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ముందుగా భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు ఏ ఎరువులు వాడాలో అవగా హన కలిగించాలని కోరారు. కౌలు రైతులకు భూ యజమానులకు సంబంధం లేకుండా గ్రామ సభల ద్వారా కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అవకతవక లుగా ఉన్న భూ సర్వేను రద్దు చేసి రైతుల సమక్షంలో గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు రీ సర్వే చేసి, పాత పాసుపుస్తకాలను అనుసరించి సవరించాలని కోరారు. రైతుల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్న భూసర్వే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 09:44 PM