Share News

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:16 AM

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని వక్తలు పేర్కొన్నారు.

విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
పీలేరులో సైన్స ఎగ్జిబిషనలో నమూనాలు పరిశీలిస్తున్న ఎంఈవో, ఉపాధ్యాయులు

మదనపల్లె టౌన/అర్బన, ఫిబ్రవరి 28: విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలని వక్తలు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్సు దినోత్సవం నిర్వహించారు. ఈ సంద ర్భంగా విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నా యి. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రిన్సిపాల్‌ కృష్ణవేణి, అధ్యాపకులు విష్ణుప్రియ బహుమతులు అందజేశారు. స్థానిక ప్రశాం తనగర్‌లోని శ్రీనివాస డిగ్రీ కళాశాలలో కళాశాల చైర్మన ఎన.కృష్ణారెడ్డి మాట్లాడుతూ కరోనా, తుఫాను, భూకంపం వంటి విపత్తులు ఎదుర వుతున్నా మానవుడు మనుగడ కేవలం సైన్సుతోనే సాధ్యమన్నారు. సైన్సు పట్ల విద్యార్థులు ఆసక్తి పెంచుకుని ఉన్నత స్థానాలకు ఎదగాల న్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన రక్తనమూనా పరీక్షల యంత్రం, పోలియో వాక్సినేషన ప్లాంట్‌, ఫొటో ఫ్లాస్ట్‌ కల్చర్‌, వాటర్‌ ప్యూరిఫికేషన ప్రయోగాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. కార్యక్ర మంలో కళాశాల డైరెక్టర్‌ శ్రీనివాసులురెడ్డి, ప్రిన్సిపాల్‌ బి.కృష్ణారెడ్డి, ఎనఎస్‌ఎస్‌ పీవో రెడ్డిశేఖర్‌, విద్యార్థులు పాల్గొన్నారు. జ్ఞానోదయ పాఠశాలలో ఘనంగా సైన్స దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో బాలబాలికలు వివిధ అంశాల లో ప్రయోగాలు చేశారు. పాఠశాల కరస్పాండెంట్‌ ప్రసాద రావు, డైరెక్టర్‌ భవానీ ప్రసాద్‌, టీచర్లు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

తంబళ్లపల్లెలో: విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలి కి తీస్తే దేశ భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందని ఎంఈవోలు త్యాగరాజు, నాగసుబ్బరాయుడు పేర్కొన్నారు. బుధవారం సర్‌సీవీ రామన జన్మదినాన్ని పురస్కరించుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ సైన్స దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తాము రూపొందించిన పలు రకాల ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనపరచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతియ స్థానాల్లో బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

పీలేరులో: జాతీయ సైన్స దినోత్సవాన్ని పీలేరు మండలంలోని ప్రభు త్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో బుధవారం పండుగ వాతావరణంలో జరు పుకున్నారు. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల్లో వివిధ నమూనాలను తయారు చేసి తమ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషనలలో ప్రదర్శించారు. జిల్లా సాంఘిక అటవీ శాఖాధికారిణి నాగమునీశ్వరి పీలేరు పట్టణంలోని ఇండియన బీచ ట్రీ పాఠశాలలో జరిగిన సైన్స దినోత్సవంలో పాల్గొని అక్కడి విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను పరిశీలించారు. ఉత్తమ నమూనాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తలపుల జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎంఈవో లోకేశ్వర్‌ రెడ్డి మాట్లాడు తూ సైన్స పట్ల మక్కుల పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎస్‌జీ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించి విజే తలకు బహుమతులు అందజేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్ర మంలో హెచఎంలు రెడ్డప్ప, సురేంద్రనాథరెడ్డి, ఫౌజియా బేగం, సుధా కర్‌, మధుసూధనరెడ్డి, అధ్యాపకులు సైఫుల్లా, వెంకటరత్నం, రాధా కృష్ణ, శ్రీనివాసులురెడ్డి, ఆనంద్‌, ఇండియన బీట్‌ ట్రీ స్కూలు ప్రిన్సి పాల్‌ భార్గవి, సీఆర్‌పీలు అశోక్‌, మురళీధర్‌ రాజు పాల్గొన్నారు.

కలకడలో:మండలంలోని కోన హైస్కూల్‌లో జాతీయ సైన్స దినోత్స వాన్ని హెచఎం చెంగల్‌రాయులు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నా రు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎంఈవో మునీంద్రనా యక్‌ మాట్లాడుతూ శాస్త్రవేత్తగా సర్‌ సీవీరామన భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాలకు విస్తరింపజేశారని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులను తయారీ చేసిన సైన్స ప్రయోగాలను పరిశీలించి విజేతల కు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎంఈవో-2 రామచం ద్రారెడ్డి, మహేశ్వరి, షౌకత ఉన్నారు.

కురబలకోటలో: విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నూతన పరి శోధనలు చేపట్టి దేశాభివృద్థికి పాటుపడాలని మిట్స్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ రామనాథమ్‌ పేర్కొన్నారు. మండలంలోని మిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశా లలో బుధవారం జాతీయ సైన్స దినోత్సవాన్ని పురస్కరించుకుని సీవీ రామన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. అనంత రం పోటీలను నిర్వహించి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమ తులను అందజేశారు. అలాగే మండలంలోని అంగళ్ళు, కురబలకోట, ముది వేడు, తెట్టు పాఠశాలల్లో విద్యార్థులు తాము చేసిన ప్రయోగాల ను ప్రదర్శించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో ద్వారకనాథ్‌, విబాగాధిపతి చంద్రమోహన, ఎనఎస్‌ఎస్‌ కో ఆర్డినేటర్‌ రాజేష్‌ పాల్గొన్నారు.

పెద్దతిప్పసముద్రంలో: మండల కేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు సైన్స మేళాలో పాల్గొ న్నారు. ఎంఈవో అద్వర్యంలో సర్‌ సీవీరామన చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పాఠశాలలో జరుగుతున్న సైన్స మేళా కార్యక్రమానికి డీవైఈవో శ్రీరాం పురుషోత్తం హాజరై విద్యార్థులు రూపొందించిన పలు సైన్స నమూనాలను పరిశీ లించి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలోని మోడల్‌ స్కూల్‌, కస్తూరిబా పాఠశాలతో పాటు పలు పాఠశాలల ప్రధానోపా ధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

వాల్మీకిపురంలో: విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని వాల్మీకిపురం ఎంఈవో వెంకటరత్నం పేర్కొన్నారు. బుధవారం మండ ల పరిధిలోని ఏపీ మైనార్టీ బాలికల గురుకులంలో ఆంధ్రప్రదేశ రాష్ట్ర శాస్త్రసాంకేతిక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందులో భాగంగా నిర్వహిం చిన వ్యాసరచన పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపిక, పుస్తకాలు అందజేశారు. ఏపీ మైనార్టీ బాలికల గురుకులం ప్రిన్సిపాల్‌ అరుణ, ఏపీకాస్ట్‌ జిల్లా కోఆర్డినేటర్‌ రవీంద్రరెడ్డి, ఉపాధ్యాయులు షఫీ, నవమల్లిక, గీత, సోఫియా, విద్యార్థులు పాల్గొన్నారు.

రామసముద్రంలో: మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో జాతీ య సైన్స దిననోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మండ లంలోని ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలలు కలిసి సుమారు 150కి పైగా సైన్సు ప్రదర్శనలను విద్యార్థులు ప్రదర్శించినట్లు ప్రధానో పాధ్యాయుడు చిట్టిబాబు, తూర్పు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు హేమలత తెలిపారు. ఉత్తమ ప్రదర్శనకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కలికిరిలో: స్థానికి జడ్పీ బాలికోన్నత పాఠశాలలో బుధవారం జాతీ య సైన్స దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హెచఎం జయమ్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో మండలంలోని పది ప్రాథమిక పాఠశాలలు, రెండు ఉన్నత పాఠశాలల విద్యార్థులు విజ్ఞాన శాసా్త్రనికి సంబంధించిన వర్కింగ్‌ మోడళ్ళు, డెమో నమూనాలు ప్రదర్శించారు. సైన్స మేళాలో ఉత్తమ నమూనాలను ప్రదర్శించిన విద్యార్థులకు ఎంఈవో కరీముల్లా బహుమతులు అందజేశారు. సీఆర్‌సీ కార్యదర్శి మురాద్‌షా, సైన్స ఉపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, సీఆర్పీ సురేష్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా స్థానిక ఇందిరమ్మ కాలనీ హై స్కూల్‌లో జరిగిన సైన్స దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ‘గ్లోబెల్‌ చాలెంజెస్‌ అండ్‌ సొల్యూషన్స’ అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. నమూనా ప్రదర్శనలో పి.రామచరణ్‌, డి.రెడ్డితేజ, ఎస్‌.సయ్యద్‌వలీ, శశాంకలకు బహుమతులు అందజేశారు. హెచఎం సంపతకుమార్‌, సైన్స ఉపాధ్యాయినులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 12:16 AM