Share News

ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేసే వరకు సమ్మె

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:09 PM

మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేసేంతవరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రా మాంజులు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూ నియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నయ్య, రాంబాబు అన్నారు.

ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేసే వరకు సమ్మె
రాజంపేటలో నిరసన వ్యక్తం చేస్తున్న మున్సిపల్‌ కార్మికులు

రాయచోటిటౌన్‌, జనవరి5: మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేసేంతవరకు సమ్మె కొనసాగిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రా మాంజులు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూ నియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నయ్య, రాంబాబు అన్నారు. మున్సి పల్‌ కార్మికుల సమ్మె 11వ రోజు శుక్ర వారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయం నుంచి మెడలో ఆకులు, గడ్డి మోకులు వేసుకుని ర్యాలీగా బంగ్లా వరకు వెళ్లి తిరిగి మున్సిపల్‌ కార్యాలయం చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్లుగా విసిగి వేసారిన కార్మికులు సమ్మెబాట పట్టారన్నారు. పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను జగన్‌ గాలికి వదిలేశాడన్నారు. జీవోఆర్‌టీ నెంబర్‌ 30 ప్రకారం పంపు ఆపరేటర్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ వర్కర్స్‌, వర్క్‌ ఇన్‌౅ స్పక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, బిల్‌ కలెక్టర్లు, స్ర్టీట్‌ లైటింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, ఆఫీసు నిర్వహణ కార్మికులకు మూడేళ్లుగా హామీల తోనే సరిపెడుతున్నారని విమర్శించారు. ఇంజనీరింగ్‌ కార్మికులకు టెక్నికల్‌ వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం దగా చేస్తున్నదన్నారు. ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్న హామీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. పట్టణాల విస్తీర్ణం, జనాభా పెరుగుదల దృష్ట్యా కార్మికుల సంఖ్యను పెంచడం లేదన్నారు. కరోనా సంద ర్భంగా తీసుకున్న అదనపు సిబ్బందికి ఉద్యోగ భద్రత లేదన్నారు. సీపీఎస్‌ రద్దు చేస్తామన్న హామీని విస్మరించారన్నారు. ఈ సమ్మెతోనైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని కోరారు. వీరి సమ్మెకు అంగన్వాడీ లీడర్లు సంఘీభావం తెలిపారు. సిద్దయ్య, సిద్దమల్లు, అశోక్‌, రవికుమార్‌, వెంకట్రమణ, మంగమ్మ, రమణమ్మ పాల్గొన్నారు.

రాజంపేట టౌన్‌: రాజంపేటలో మున్సిపల్‌ కార్మికులు గోవిందా.. గోవిందా.. ఇచ్చిన మాట గోవిందా.... అంటూ నినాదాలు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్‌, యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఓబయ్య, ప్రసాద్‌, లక్ష్మీదేవి, రమణ, బాలాజీ, ప్రమీల పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:09 PM