Share News

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - May 24 , 2024 | 10:20 PM

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని రిటర్నింగ్‌ అధికారి మోహనరావు, డీఎస్‌పి చైతన్యలు సూచించారు.

అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు
రాజకీయ పార్టీ నాయకులకు సూచనలిస్తున్న రిటర్నింగ్‌ అధికారి మోహనరావు, డీఎస్పీ చైతన్య

రిటర్నింగ్‌ అధికారి మోహనరావు

రాజంపేట టౌన, మే 24 : ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని రిటర్నింగ్‌ అధికారి మోహనరావు, డీఎస్‌పి చైతన్యలు సూచించారు. శుక్రవారం పట్టణంలోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ సభా భవనంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా అమలు చేయనున్న నిబంధనలు, జాగ్రత్తలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజంపేట నియో జక వర్గంలో మొత్తం 288 కేంద్రాలుండగా, 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తు న్నట్లు తెలిపారు. 20 రౌండ్లు ఉంటాయన్నారు. ఈ నెల 30వ తేదీ లోగా నియోజక వర్గంలోని అభ్యర్థులు కౌంటింగ్‌ ఏజెంట్లకు ఫాం 18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రాయచోటి కలెక్టరేట్‌ కార్యాలయం ఎదురుగా వున్న సాయి ఇంజనీరింగ్‌ కళాశాలలో జూన 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుందన్నారు. ఎన్నికల సిబ్బందికి ఏజెంట్లు సహకరించాలన్నారు. అలాగే విజయోత్సవ సంబరాలు, బాణసంచా పేల్చడం నిషేధించినట్లు తెలిపారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు పాల్గొన్నారు.

Updated Date - May 24 , 2024 | 10:20 PM