Share News

కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:37 PM

ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంక టేష్‌, మాజీ మండల అధ్యక్షుడు రాజన్నలు పేర్కొన్నారు.

కూటమి  అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి
నిమ్మనపల్లెలో ప్రచారం చేస్తున్న కూటమి నాయకులు

నిమ్మనపల్లి, ఏప్రిల్‌ 24: ఉమ్మడి అభ్యర్థులను గెలిపిస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టీడీపీ రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధి ఆర్జే వెంక టేష్‌, మాజీ మండల అధ్యక్షుడు రాజన్నలు పేర్కొన్నారు. బుధవారం ము ష్టూరు పంచాయతిలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహనబాషాను, ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రతి ఇంటికి తిరిగి కరప త్రాలను పంచుతూ టీడీపీ అధాకారంలోకి రాగానే బీసీల కొరకు టీడీపీ 50ఏళ్లకే పింఛనను ప్రవేశపెట్టిందని తెలిపారు. అలాగే వైసీపీ పార్టీ తమ గామ్రంలో ఎటువంటి అభివృద్ది చేయలేదని ఆ పార్టీకి చెందిన వైసీపీ సింగిల్‌ విండో డైరెక్టర్‌ ఆదెన్న, మన్సూర్‌ బేగ్‌, ఆకుల వెంకటర మణ, అంజాద్‌అలీ, మస్తానవలీ, సాబ్‌జానసాబ్‌లు రాజన్న, ఆర్జే వెంక టేష్‌ ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. అనం తరం వారు మాట్లాడుతూ వైసీపీ 5ఏళ్లు అధికారంలో వున్నా తమను ఏనాడు పట్టిం చుకోలేదని తెలిపారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా షాజహనబాషాకు సైకిల్‌ గుర్తుకు, ఎంపీగా కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించి చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ రమణ, రామకృష్ణ, రెడ్డెప్ప, చంద్రసింగ్‌, మెకానిక్‌ బాషా, మోహన, తేజ, నరసింహులు, శ్రీపతి, మహమ్మద్‌రఫి, శ్రీరాములు, సుధాకర్‌, జగధీష్‌, రెడ్డెప్ప, జయన్న పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:37 PM