Share News

సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

ABN , Publish Date - Jul 08 , 2024 | 11:25 PM

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య సభ్యులు కోరారు.

సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి
కమిషనర్‌ ప్రమీలకు వినతి పత్రం అందిస్తున్న వార్డు, సచివాలయ ఉద్యోగులు

మదనపల్లె టౌన, జూలై 8: రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమాఖ్య సభ్యులు కోరారు. ఆ మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ కె.ప్రమీలకు వారొక వినతి పత్రం అందజేశారు. సోమవారం సచి వాలయ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర అధ్య క్షుడు గుడి నాగరాజ ఆధ్వర్యంలో మున్సి పల్‌ కమిషనర్‌కు సమస్యలు విన్నవించారు. సచివాలయ ఉద్యోగులు మూడేళ్లుగా బీఎల్‌ వోలుగా పనిచేశారని వారికి ఇంత వరకు గౌరవ వేతనం మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల అర్జిత సెలవులను ఎస్‌ఆర్‌ రిజిస్టర్‌లో నమోదు చేసి హెచఆర్‌ ఎంఎస్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేయాలని కోరారు. జూలై నెల నుంచి ఇవ్వాల్సిన వార్షిక ఇంక్రి మెంట్లను మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, సతీష్‌, ప్రసాద్‌, రవీంద్రనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 08 , 2024 | 11:25 PM