Share News

సా్ట్రంగ్‌రూమ్‌లను పరిశీలించిన ఆర్డీవో

ABN , Publish Date - Feb 06 , 2024 | 11:59 PM

మదనపల్లె నియోజకవర్గం పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవీఎంలను భద్రపరచ డానికి సా్ట్రంగ్‌ రూమ్‌, ఎన్నికల సామాగ్రి భద్ర పరచడానికి గదులను ఆర్డీవో హరిప్రసాద్‌ పరిశీలించారు.

సా్ట్రంగ్‌రూమ్‌లను పరిశీలించిన ఆర్డీవో
మదనపల్లె జడ్పీహైస్కూల్లో సా్ట్రంగ్‌రూమ్‌ గదులను పరిశీలిస్తున్న ఆర్డీవో హరిప్రసాద్‌

మదనపల్లె టౌన, ఫిబ్రవరి 6: మదనపల్లె నియోజకవర్గం పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈవీఎంలను భద్రపరచ డానికి సా్ట్రంగ్‌ రూమ్‌, ఎన్నికల సామాగ్రి భద్ర పరచడానికి గదులను ఆర్డీవో హరిప్రసాద్‌ పరిశీలించారు. మంగళవారం స్థానిక జడ్పీ హైస్కూ ల్లో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీల, తహ సీల్దార్‌ రమాదేవిలతో కలసి గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని మూడు మం డలాలు, మున్సిపాలిటిలో 259 పోలింగ్‌ స్టేషనలు వున్నాయన్నారు. వాటిని సెక్టోరియల్‌ అధికారుల పర్యవేక్షణలో ఎన్నికల సామగ్రి పంపిణీకి జడ్పీ హైస్కూల్‌ అనువుగా ఉందని, ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపుతామన్నారు. ఎన్నికల డీటీ అస్లాం, మణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 11:59 PM