అధికార పార్టీ అండతోనే పేట్రేగిపోతున్న స్మగ్లర్లు
ABN , Publish Date - Feb 06 , 2024 | 11:57 PM
అధికార పార్టీ అండ దండలతోనే ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగి పోతున్నారని పీలేరుకు చెందిన టీడీపీ నా యకులు ఆరోపించారు.
పీలేరు, ఫిబ్రవరి 6: అధికార పార్టీ అండ దండలతోనే ఎర్రచందనం స్మగ్లర్లు పేట్రేగి పోతున్నారని పీలేరుకు చెందిన టీడీపీ నా యకులు ఆరోపించారు. పార్టీ కార్యాలయం లో మంగళవారం జరిగిన విలేఖరుల సమా వేశంలో నాయకులు కోటపల్లె బాబురెడ్డి, శ్రీకాంతరెడ్డి, పోలిశెట్టి సురేంద్ర మాట్లాడు తూ అధికార పార్టీ నాయకులు అండదండలు ఉండడంతోనే ఏం చేసినా చెల్లిపోతుందన్న ధైర్యంతో స్మగ్లర్లు పోలీసులపైనే దాడికి పూను కున్నారన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ గణేశ మృతి చెందిన సంఘటనలో ఎంతటి వారున్నా శిక్షించి పోలీసులు తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. స్థానికంగా ఉన్న పలువురు అధికార పార్టీకి చెందిన నాయకులు కేవీపల్లె, సుండుపల్లె మండలాల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సహాయసహకారాలు అందిస్తున్నారని, వారందరినీ ఇప్పటికైనా కఠినంగా శిక్షిం చాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు కానిస్టేబుల్ గణేశది ప్రభుత్వ హత్యేనంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాశ మంగళవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గడిచిన నాలుగున్నరేళ్లుగా అధికార వైసీపీ నాయకులు ఏ వ్యవ స్థనూ సక్రమంగా పనిచేయనివ్వలేదని మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లర్లకు ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించడం వైసీపీకే చెల్లిందన్నారు. ఇకనైనా పోలీసులు ఎవరి ఒత్తిళ్లకు లొం గకుండా గణేశ మృతికి కారణమైన స్మగ్లర్లు, వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.