Share News

శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు సర్‌ సీవీ రామన్‌!

ABN , Publish Date - Feb 28 , 2024 | 11:22 PM

ఆధునిక భారతీయ శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్‌ సీవీ రామన్‌ అగ్రగణ్యుడని స్టెప్‌ ముఖ్య కార్య నిర్వహ ణాదికారి సాయిగ్రేస్‌ కొనియాడారు.

శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడు సర్‌ సీవీ రామన్‌!
నాగరాజుపేట: సర్‌ సీవీ రామన్‌కు నివాళులర్పిస్తున్న అధికారులు ఉపాధ్యాయులు

కడప (నాగరాజుపేట) : ఆధునిక భారతీయ శాస్త్రవేత్తల పరిశోధన ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన వ్యక్తుల్లో సర్‌ సీవీ రామన్‌ అగ్రగణ్యుడని స్టెప్‌ ముఖ్య కార్య నిర్వహ ణాదికారి సాయిగ్రేస్‌ కొనియాడారు. జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నగరంలోని గంగాభవానీ జిల్లా పరిషత్‌ బాలికో న్నత పాఠశాలలో జాతీయ సైన్స్‌ ఫేర్‌ నిర్వహిం చారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ నమూనాలను పరిశీలించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు సోఫియా, మేనేజరు సుబ్బరాయుడు, వి.నారాయణ, విద్యార్థులుపాల్గొన్నారు.

కడప (ఎర్రముక్కపల్లె): చిన్నచౌకు శ్రీచైతన్య పాఠశాలలో ఆర్ట్స్‌ కళాశాల రసాయన శాస్త్ర విభా గాధిపతి, వైవీయూ పాలక మండలి సభ్యురాలు డాక్టర్‌ జె.వెంకటలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థుల కు స్కూలు స్థాయి నుంచే సైన్స్‌పై అవగాహన ఉండా లన్నారు. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు ఎలా ఉన్నాయో, కొన్ని సంవత్సరాల్లో శాస్త్రవేత్తలకు కూడా అంతే అవకాశాలుంటాయని ప్రతి ఒక్కరూ పరిశోధనల వైపు దృష్టి పెట్ల్టాలని సూచించారు. చిన్నారులకు బహుమతులు అందించి అభినందిం చారు. కార్యకమ్రంలో ఏజీఎం రమణయ్య, ప్రిన్సిపాల్‌ నాగభూషణం పాల్గొన్నారు.

సికెదిన్నె: సైన్స్‌ ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చింతకొమ్మదిన్నె ఎంఈవో వెంకటరామిరెడ్డి తెలిపారు. చింతకొమ్మదిన్నె జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో భారతీయ శాస్త్రవేత్తల ఛాయా చిత్రాల ఎగ్జిబిషన్‌, డ్రాయింగ్‌, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ సైన్స్‌ అన్ని రంగాల్లో అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందన్నారు. సీవీ రామన్‌ రామన్‌ ఎఫెక్ట్‌ ఫలితంగా ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజును సైన్స్‌డేగా జరుపుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సింహాద్రిపురం: విద్యార్థులు సృజనాత్మకతతో అద్బుత ప్రాజెక్టులు రూపొందించారని ప్రధానోపాఽ ద్యాయురాలు రవణమ్మ తెలిపారు. కోవరంగుట్ట పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో సైన్సు ఉపాధ్యా యులు సతీష్‌, గాయత్రి ఆధ్వర్యంలో విద్యార్థులు సైన్సు ప్రదర్శన ఏర్పాటు చేశారు. అధ్బుత ప్రాజె క్టులు రూపొందించిన విద్యార్థులను హెచ్‌ఎం, ఉ పాధ్యాయులు అభినందిస్తూ, వారికి బహుమతు లు అందజేశారు.

వేంపల్లె: విద్యార్థులందరు సైన్స్‌పై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని చైతన్య హైస్కూల్‌ కర స్పాండెంట్‌ చక్రపాణిరెడ్డి విద్యార్థులకు సూచిం చారు. స్థానిక చైతన్య హైస్కూల్లో బుధవారం సైన్స్‌ఫేర్‌ నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్లు చేతన్‌ రెడ్డి, చైతన్యరెడ్డి, ఉపాధ్యాయు లు పాల్గొన్నారు. శ్రీనివాస హైస్కూల్లో సైన్స్‌ఫేర్‌ నిర్వహించారు. కరస్పాండెంట్‌ కేశవులు పాల్గొన్నారు.

వీరపునాయునిపల్లె: పాయసంపల్లె కందుల మంగమ్మ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు మురళీకృష్ణ ఆధ్వర్యంలో సైన్స్‌ఫెయిర్‌ నిర్వహించారు. ఉపాధ్యాయుడు కృష ్ణకిషోర్‌, ఆదినారాయణ, మస్తాన్‌, సుజా, మోహన్‌, రాజశేఖర్‌, మల్లికార్జునరెడ్డి, సుబ్బన్న, జయరాణ మ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 11:22 PM