శంకర్‌యాదవ్‌ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించాలి
ABN , Publish Date - Mar 06 , 2024 | 10:53 PM
తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ టికెట్ శంకర్‌యాదవ్‌కే ప్రకటించాలంటూ బుధవారం పీటీఎంలో మొలకల చెరువు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనాథ్‌రెడ్డి, తెలుగు తమ్ముళ్లు, శంకర్ అనుచరులు ఆందోళన చేశారు.

టీడీపీ కార్యకర్తల ఆందోళన
పెద్దతిప్పసముద్రం మార్చి 6 : తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ టికెట్ శంకర్‌యాదవ్‌కే ప్రకటించాలంటూ బుధవారం పీటీఎంలో మొలకల చెరువు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనాథ్‌రెడ్డి, తెలుగు తమ్ముళ్లు, శంకర్ అనుచరులు ఆందోళన చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడు తూ శంకర్‌యాదవ్ సేవలను గుర్తించి న్యాయం చేయాలని కోరారు. లోకేష్ పాదయాత్ర, మదనపల్లెలో మినీ మహానాడు, పీటీఎంలో అన్న క్యాంటీన్ ను పోలీసులతో అడ్డుకోవాలని చూసిన అధికార పార్టీ నాయకులను లెక్కచేయకుండా విజయవంతం చేశాడన్నారు. శంకర్‌యాదవ్‌ను తంబళ ్లపల్లె తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించి ఆయనకు న్యాయం చేయాలని కో రారు. కార్యక్రమంలో క్ల్టస్టర్ ఇన్‌చార్జ్ మద్దయ్యగారిపల్లె హరి, కట్టా సురేంద్ర నాయుడు, ఎస్సీ సెల్ కార్యదర్శి తమక శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి శివానంద, జడ్పీటీసీ మాజీ సభ్యుడు గూటం ఈశ్వరప్ప, బూర్లపల్లె సుధాకర్‌రెడ్డి, తాడిగోళ్లపల్లె సుధాకర్‌రెడ్డి, గ్రామ అధ్యక్షుడు కత్తి ఆదినారాయణ, చింతకాయల వినోద్, రాము, మాజీ సర్పంచ్ ఇ.వి. రమణ, ఫకృద్దీన్, షఫీ, నియోజకవర్గ బీసీ అధ్యక్షుడు మధుకర్‌యాదవ్, నాగరాజు యాదవ్, పెద్దన్న, రవీంద్ర, సాయి,లతో పాటు బి.కొత్తకోట టీడీపీ నాయకులు కుడుం శరత్, శ్రీనాథ్ నాయుడు, కుడుం రంజిత్, మహేష్, నియోజకవర్గ ఎస్సీ సెల్ అద్యక్షుడు సురేంద్రబాబులతో పాటు అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.