Share News

ఇసుక మాఫియా కనపడటం లేదా..?: టీడీపీ

ABN , Publish Date - Jan 29 , 2024 | 11:42 PM

వాల్మీకిపు రం మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు ఎస్‌ఈబీ అధికారులకు కన బడటం లేదా..? అని మండల టీడీ పీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి ప్రశ్నిం చారు.

ఇసుక మాఫియా కనపడటం లేదా..?: టీడీపీ
్ఠవాల్మీకిపురంలో ఎస్‌ఈబీ అఽధికారులకు వినతి పత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

వాల్మీకిపురం, జనవరి 29: వాల్మీకిపు రం మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు ఎస్‌ఈబీ అధికారులకు కన బడటం లేదా..? అని మండల టీడీ పీ అధ్యక్షుడు మల్లికార్జునరెడ్డి ప్రశ్నిం చారు. సోమవారం స్థానిక పార్టీ నా యకులతో కలిసి ఎనఫోర్స్‌మెంట్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని మాధవరంపల్లె, మేడికుర్తి రిజర్వాయర్‌ ప్రాంతాలలో రాత్రి సమయాలలో హిటాచిలు పెట్టి రిజర్వాయర్‌ ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకుండా అధికార పార్టీ తొత్తులుగా మారుతున్నారని విమర్శించారు. నీటిపారు దల శాఖ ఉత్తర్వులను కూడా లెక్క లేయడం లేదన్నారు. మండలంలోని కూరపర్తి గ్రామం మొదలుకుని కలికిరి మండలం మహల్‌ వరకు నిత్యం వందల సంఖ్యలో ట్రాక్టర్లల, టిప్పర్లలో ఇసుక అక్ర మంగా తరలిపోతోందన్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎస్‌ఈబీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వెంకటరమణ, నాయకులు కోసూరి చంద్రమౌళి, పీవీ నారా యణ, రాజేంద్రాచారి, నారాయణరెడ్డి, కేకే నాయుడు, గాంధీపేట రెడ్డి, బుజ్జి పాల్గొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 11:42 PM