Share News

గాలివానకు ఽఎగిరిపోయిన పైకప్పు రేకులు

ABN , Publish Date - Jun 02 , 2024 | 09:46 PM

మండలం లోని కుమ్మరపల్లి గ్రామ పంచాయతీ లోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి వీచిన గాలివానకు పలు ఇళ్ల పైకప్పునకు వేసిన రేకులు ఎగిరి పోయాయి. మరో ఇంటిపై విద్యుత స్తంభం విరిగి పడింది.

గాలివానకు ఽఎగిరిపోయిన పైకప్పు రేకులు
గాలివానకు ఎగిరిపోయిన రేకులు

రామాపురం, జూన 2: మండలం లోని కుమ్మరపల్లి గ్రామ పంచాయతీ లోని పలు గ్రామాల్లో శనివారం రాత్రి వీచిన గాలివానకు పలు ఇళ్ల పైకప్పునకు వేసిన రేకులు ఎగిరి పోయాయి. మరో ఇంటిపై విద్యుత స్తంభం విరిగి పడింది. కుమ్మరపల్లి పంచాయతీలోని దూదేకులపల్లెలో సుంకేల కృష్ణయ్య, రాజు, బండపల్లె లో షేక్‌. ముబారక్‌, మోహన, లక్ష్మయ్య, జమాల్‌వల్లి ఇళ్లపై ఏర్పాటు చేసిన రేకులు గాలివానకు లేచిపోయాయి. చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. అదే గ్రామానికి చెందిన షేక్‌. అబ్దుల్‌సాబ్‌ ఇంటిపై విద్యుత స్తంభం పడడంతో రేకులు విరిగి పడ్డాయి. ఇళ్లల్లో ఉన్న పిల్లలు, పెద్దలు, మహిళలు భయంతో బయటికి పరుగులు తీశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఇప్పటి వరకూ అధికారులెవరూ గ్రామాన్ని సందర్శించలేదని గ్రామస్తులు తెలిపారు.

Updated Date - Jun 02 , 2024 | 09:46 PM