పెరుగుతున్న టమోటా ధరలు..కిలో రూ.56
ABN , Publish Date - Nov 25 , 2024 | 11:51 PM
మదనపల్లె మార్కె ట్‌యార్డులో టమోటాల ధరలు నిత్యం పెరుగుతూ వస్తున్నాయి.
మదనపల్లె టౌన, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): మదనపల్లె మార్కె ట్‌యార్డులో టమోటాల ధరలు నిత్యం పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం మదనపల్లె మార్కెట్‌కు కేవలం 166 మెట్రిక్ టన్నుల టమోటా మాత్రమే విక్రయానికి రావడంతో వ్యాపారుల మధ్య డిమాండ్ పెరిగి టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మార్కెట్‌లో మొదటి రకం టమోటా కిలో గరిష్టంగా రూ.56 పలుకగా, రెండో రకం టమోటా కనిష్టంగా కిలో రూ.32 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అనంతపురం, ఉత్తరాది రాష్ట్రాల్లో టమోటా దిగుబడి తగ్గిపోవడంతో వ్యాపారులు మదనపల్లె మార్కెట్‌వైపు వస్తున్నట్లు మండీ యజమానులు చెబుతున్నారు. మదనపల్లె మార్కెట్‌కు ఈ వారంలో సరాసరిన ప్రతి రోజు 250టన్నుల టమోటా విక్రయానికి వచ్చింది. కాగా ఒక్కసారిగా 90 టన్నులు తగ్గిపోవడంతో కూడా టమోటా ధరలు పెరగడానికి కారణంగా చెప్పవచ్చు.