Share News

పెరుగుతున్న టమోటా ధరలు

ABN , Publish Date - Jul 28 , 2024 | 11:36 PM

బయటి రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉన్న కారణంగా టమోటా ధరలు పెరుగుతున్నాయి.

పెరుగుతున్న టమోటా ధరలు

22 కేజీల బాక్సు రూ.800 బయటి రాషా్ట్రల్లో డిమాండ్‌

ములకలచెరువు, జూలై 24: బయటి రాష్ట్రాల్లో డిమాండ్‌ ఉన్న కారణంగా టమోటా ధరలు పెరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం తగ్గిన టమోటా ధరలు ప్రస్తుతం పెరుగుతున్నాయి. ములకలచెరువు మార్కెట్‌ నుంచి టమోటాలు ఉత్తరప్రదేశ, మధ్యప్రదేశ, చత్తీ్‌సఘడ్‌, ఢిల్లీ, జార్ఖండ్‌ తదితర రాషా్ట్రలకు ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతి అవుతున్న రాషా్ట్రల్లో టమోటాల దిగుబడి తగ్గిపోవడంతో ఇక్కడి టమోటాలకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో ధరలు పుంజుకుంటున్నాయి. స్థానిక మార్కెట్‌లో ఆదివారం టమోటా ధరలు నాణ్యతను బట్టి 22 కేజీల బాక్సు రూ.500 నుంచి రూ.800 వరకు పలికింది. నిన్నటి వరకు బాక్సు ధర రూ.400 నుంచి రూ.650 వరకు పలికాయి. ఆదివారం ధరలు పెరిగాయి. టమోటా ధరలు నిలకడగా ఉండే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు. కాగా టమోటాలు మార్కెట్‌కు పోటెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టమోటాలు అమ్మకానికి వస్తుండడంతో మార్కెట్‌ కిక్కిరిసిపోతోంది.

Updated Date - Jul 28 , 2024 | 11:36 PM