Share News

ఫైబర్‌ నెట్‌లో ఏబీఎన ప్రసారాల పునరుద్ధరణ

ABN , Publish Date - Jun 08 , 2024 | 11:37 PM

ప్రభుత్వ పైబర్‌ నెట్‌ కేబుల్‌ సర్వీసుల ద్వారా ఏబీఎన ప్రసారాలను ప్రభుత్వం పునరుద్ధరిం చింది.

ఫైబర్‌ నెట్‌లో ఏబీఎన ప్రసారాల పునరుద్ధరణ
ఫైబర్‌ నెట్‌లో ప్రసారమవుతున్న ఏబీఎన కార్యక్రమాలు

కలికిరి, జూన 8: ప్రభుత్వ పైబర్‌ నెట్‌ కేబుల్‌ సర్వీసుల ద్వారా ఏబీఎన ప్రసారాలను ప్రభుత్వం పునరుద్ధరిం చింది. కోర్టులు ఆదేశించినా, నియంత్రి త సంస్థలు చొరవ తీసుకున్నా ఖాత రు చేయకుండా గత ఐదేళ్ల నుంచి జగన ప్రభుత్వం ఏబీఎన ప్రసారాలు జరుగకుండా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఏబీఎనతోపాటు ఈటీవీ, టీవీ5 న్యూస్‌ చానెళ్ళను ప్రసారం చేయ కుండా ప్రభుత్వం నిషేధించింది. అయితే ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టనుండడంతో శుక్రవారం నుంచి ప్రసారాలను స్వచ్ఛందంగా పునరుద్ధరించారు. కొత్త ప్రభుత్వం ఇంకా కొలువుదీరకున్నా అధికారులు చొరవ తీసుకుని జరిగిన తప్పును సరిదిద్దుకున్నారు. కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకుంటే ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న ఆందోళనతో అధికారులే ఏకపక్షంగా ప్రసారాలను పునరిద్ధరించారని చెపుతున్నారు. కాగా ఏబీఎన ప్రసారాలు 55వ చానెల్‌ ప్రసార మవుతున్నట్లు ఫైబర్‌ నెట్‌లో పేర్కొంటున్నారు. (అదే విధంగా ఈటీవీ 51, టీవీ5 56వ చానెల్‌లో ప్రసారమవుతున్నాయి.)

Updated Date - Jun 08 , 2024 | 11:37 PM