Share News

సిసలైన రాయలసీమ ద్రోహి జగన్‌రెడ్డి

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:01 PM

అసలు సిస లైన రాయలసీమ ద్రోహి జగన్‌మోహన్‌ రెడ్డి అని, అభివృద్ధిపై మాట్లాడే అర్హతను ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎప్పుడో కోల్పోయా డని, అవినీతి కలెక్టర్‌తో ఆయనకున్న స్నేహబంధం రాయచోటిని భూ దందాల కు నిలయంగా మార్చిందని టీడీపీ రాయచోటి ఇన్‌చార్జి రమేశ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

సిసలైన రాయలసీమ ద్రోహి జగన్‌రెడ్డి
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌ రెడ్డి

రాయచోటిటౌన్‌, జనవరి 28: అసలు సిస లైన రాయలసీమ ద్రోహి జగన్‌మోహన్‌ రెడ్డి అని, అభివృద్ధిపై మాట్లాడే అర్హతను ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎప్పుడో కోల్పోయా డని, అవినీతి కలెక్టర్‌తో ఆయనకున్న స్నేహబంధం రాయచోటిని భూ దందాల కు నిలయంగా మార్చిందని టీడీపీ రాయచోటి ఇన్‌చార్జి రమేశ్‌కుమార్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదివారం స్థానిక తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పీలేరులో జరిగిన రా కదలిరా సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియ జేశారు. అనంతరం మాట్లాడుతూ అభివృద్ధి చేశానని రాయచోటి ఎమ్మెల్యే గొంతు చించుకుంటున్నాడని, డివైడర్స్‌కు , కలెక్టరేట్‌కు రాళ్లు వేయడం, కలెక్టరేట్‌కు కేటాయించిన భూములను దోచుకోవడం, ఇసుక దందా, స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌ కట్టడం ఒక అభివృద్ధేనా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కలెక్టర్‌ తో కలిసి ఆయన చేసిన అవినీతిపై ఎంక్వయిరీ చేయిస్తామని హెచ్చరిం చారు. కృష్ణాజలాలను రాయచోటికి తెప్పిస్తానని ఓటు అడుగుతూ బ్యానర్లు వేసుకున్నావు. ఏ ఒక్క ప్రాజెక్టు కైనా నీరు చేరిందా, అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే నిర్వాసితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేని మీరు అభివృద్ధి గురించి మాటా ్లడుతున్నారా...? అని ప్రశ్నించారు. చేతగాని ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీని గానీ, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడునుగానీ విమర్శించే హక్కు లేదన్నారు. మోసాలతో కోట్టు కొల ్లగొట్టి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో ఆ విషయం తెలుస్తుం దన్నారు. రాజకీయ వ్యాపారి జగన్‌మోహన్‌రెడ్డికి ఇక కేవలం రెండు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉందన్నారు. దోపిడీలు, దౌర్జన్యాలు చేసే సమయం అయిపోయిం దని, ఇక అంగడి సర్దుకోవాల్సిందేనని హెచ్చరించా రు. మీ పార్టీ నుంచి క్యూ కడుతున్న వారు మీ నాయకుడి గురించి ఏం మాట్లాడుతున్నారో.. మొన్న మా పార్టీలో చేరిన మీ చిన్నాయనను అడుగు తెలుస్తుందన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో ఒక్కసారి కూడా జగన్‌ మోహన్‌ రెడ్డి అపాయిం ట్మెంట్‌ కూడా దొరకలేదని ఆయన మీడి యాకు వివరించారన్నారు.

ముస్లిం మైనార్టీలకు తీవ్ర అన్యాయం:

రాష్ట్రంలో మైనార్టీలకు ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన అన్యాయం జరుగు తుండగా, ఈ ఎమ్మెల్యే ఏదో ముస్లిం మైనార్టీలను ఆదుకున్నామని ప్రగల్భాలు పలుకుతున్నాడని, ఎక్కడ ఎవరికి ఉపయోగపడ్డావో కొంచెం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు ముస్లిం మైనారిటీల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తీసివేశారన్నారు. రిజర్వేషన్లు కల్పించామని చంకలు గుద్దుకోవడం కాదని, ఒక్క ఉద్యోగం అన్నా భర్తీ చేశారా అని ప్రశ్నించారు. రాబోయే కాలంలో రాయచోటి నియోజకవర్గంలో ముస్లింలు కచ్చితంగా బుద్ధి చెప్తారని హెచ్చరించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్‌ బిల్లులు ఎంత ఉన్నాయో.. ఇప్పుడు ఎంత ఉన్నాయో ఒకసారి బిల్స్‌ చూసి చెప్పాలరు. మద్యపానాన్ని పూర్తిగా నిషేధించిన తర్వాతనే జనాల్లోకి వెళ్లి ఓటు అడుగుతా అని మీ ముఖ్యమంత్రి బల్లగుద్ది చెప్పాడని, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వెళ్తాడని ఆయన ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్‌ బాషా, రాయచోటి మండల అధ్యక్షులు మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మల్లు నరసారెడ్డి, సంబేపల్లె మండల టీడీపీ అధ్యక్షులు చిన్నరెడ్డెయ్యయాదవ్‌, చిన్నమండెం మండల టీడీపీ అధ్యక్షులు బెల్లం నరసింహారెడ్డి, టీడీపీ యువనాయకులు దివ్యకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:01 PM