Share News

మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌

ABN , Publish Date - Apr 11 , 2024 | 11:42 PM

మతసామరస్యానికి ప్రతీక కగా రంజాన్‌ నిలుస్తోందని మతగురువులు ఉద్ఘాటించారు. రంజాన్‌ పర్వదినం ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. కొర్రపాడు రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార ్థనలు చేశారు.

మతసామరస్యానికి ప్రతీక రంజాన్‌
ప్రొద్దుటూరులో మౌలానామేరాజ్‌ రజఖాద్రీ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు

ప్రొద్దుటూరు టౌన్‌, ఏప్రిల్‌ 11: మతసామరస్యానికి ప్రతీక కగా రంజాన్‌ నిలుస్తోందని మతగురువులు ఉద్ఘాటించారు. రంజాన్‌ పర్వదినం ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. కొర్రపాడు రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార ్థనలు చేశారు. ఆర్‌అండ్‌బీ, పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో కూడా ప్రార్థనలు చేశారు. దీంతో ఈద్గా మైదానం కిటకిటలాడింది. దర్గామసీదు ఇమామ్‌ మౌలానా మేరాజ్‌ రజఖాద్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అల్లాహ్‌ చూపిన శాంతి, కరుణ, దయ, సేవా మార్గంలో నడుచుకోవాలన్నారు. రంజాన్‌ పర్వదినం విశిష్ఠతను, అల్లాహ్‌ గొప్పతనాన్ని, ఖురాన్‌ పవిత్రత గురించి వివరించారు. ఈద్గా వద్ద గట్టి బందోబస్తు నిర్వహించారు. అంజుమన్‌ అహ్లే ఇస్లాం కమిటీ అధ్యక్షుడు బొల్లవరం బాష, కార్యదర్శి ఇలియాస్‌ ఖురేషి, కోశాధికారి ఖాదర్‌వలి, జామియామసీదు మాజీ అధ్యక్షుడు అహ్మద్‌హుస్సేన్‌, మత పెద్దలు, పాల్గొన్నారు.

జమ్మలమడుగులో....

జమ్మలమడుగు, ఏప్రిల్‌ 11: సమాజంలోని పేదలకు దానధర్మాలు చేయడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం, ఇస్లాం ముఖ్య ఉద్దేశమని జమ్మలమడుగు జామియా మసీదు పీఠాధిపతి సయ్యద్‌షా షాదిక్‌పాషాఖాద్రి సూచించారు. గురువారం పెన్నానది వడ్డునగల షాహీఈద్గా ఆవరణలో పవిత్ర రంజాన్‌ పండుగ ఈదుల్‌ఫితర్‌ ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని నాగులకట్ట శివార్లలో ముస్లిం మత పెద్దలు రంజాన్‌ ప్రార్థనలు నిర్వహించారు. గౌసియా మసీదు పీఠాధిపతి గౌస్‌పీరాఖాద్రి రంజాన్‌ మాసం గురించి వివరించారు. కార్యక్రమంలో పీఠాధిపతి గురువులు, ముస్లిం మైనార్టీ నేతలు, మున్సిపల్‌ మాజీ వైస్‌ఛైర్మన్‌ ముల్లాజానీ, తదితరులు, పట్టణంలోని ఈద్గా వద్ద టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ మూలె సుధీర్‌రెడ్డి ముస్లింలకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

మైలవరంలో....

మైలవరం, ఏప్రిల్‌ 11: పేదలకు దానధర్మాలు చేయడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే ఇస్లాం ముఖ్య ఉద్దేశమని గురువులు తాహీర్‌ పీరాఖాద్రి అన్నారు. ము స్లింలు, చిన్నారులతో కలిసి ఈద్గా వద్ద పవిత్ర రంజాన్‌ పండుగ నవాజ్‌ నిర్వహించారు. పేద సాదలకు తమ శక్తి మేర సహాయ సహకారాలు అందించడం, ఇతరులతో కలిసి మెలసి మెలగడం, నమాజు చదవడం, ఉపవాసాలు పాటించడం ఇస్లాం ముఖ్య ఉద్దేశమన్నారు.

కొండాపురంలో....

కొండాపురం, ఏప్రిల్‌ 11: మండలంలో రంజాన్‌ పండుగను ముస్లింలు గురువారం ఘనంగా చేసుకున్నారు. స్థానిక ఈద్గా వద్ద ముస్లింలు నమాజు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్‌ శుభాకాంక్షలు ప్రకటించుకున్నారు. పేదలకు దానధర్మాలు నిర్వహించారు.

ఎర్రగుంట్లలో....

ఎర్రగుంట్ల, ఏప్రిల్‌ 11: నెలరోజుల కఠిన ఉపవాసాల అనంతరం ముస్లింలు రంజాన్‌ పండుగను భక్తిశ్రద్దలతో చేసుకున్నారు. వలసపల్లె రోడ్డులోని ఈద్గాలో, ముద్దనూరు రోడ్డులోని జామియా మసీదులో, ఎర్రగుంట్ల నగరపంచా యతీలోని మసీదులకు తరలివచ్చిన మస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చిలమకూరు ఈద్గాలోను, ఇతర గ్రామా ల్లోని మసీదుల్లో పెద్దఎత్తున ప్రార్థనలు నిర్వహించారు.

ముద్దనూర్లులో....

ముద్దనూరు ఏప్రిల్‌11: మండలంలో ముస్లింలు రంజాన్‌ వేడుకలను గురువారం ఘనంగా చేసుకున్నారు. ఉదయం ముస్లింలు తాడిపత్రి రోడ్డులోని ఈద్గా వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శుభాకాంక్షలు ప్రకటించుకున్నారు.

నిత్యావసరాలు పంపిణీ

మండల కేంద్రం ముస్లింలకు రంజాన్‌ పండుగ వేళ డాక్టర్‌ మధుసూదనరెడ్డి నిత్యావసరాలను అందించారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కేజీ చికెన్‌, కూరగాయలను దాదాపు 500 కుటుంబాలకు పంపిణీ చేశారు. ఏటా రంజాన్‌ పర్వదినం పురస్కరించుకుని పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

బద్వేలులో....

బద్వేలు రూరల్‌, ఏప్రిల్‌ 11: రంజాన్‌ పర్వదినం పురస్కరిం చుకుని ముస్లింలు రంజాన్‌ వేడుకలు ఘనంగా చేసుకున్నా రు. స్థానిక సిద్దవటం రోడ్డులోని ఈద్గా వద్ద ఉదయాన్నే ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. మతగురువు అబ్దుల్‌ హా దీ మౌలానా రంజాన్‌ విశిష్టత గురించి వివరించారు. స్నేహితులకు విందు నిర ్వహించారు.

మజ్జిగ పంపిణీ

పోరుమామిళ్ల, ఏప్రిల్‌ 11: రంజాన్‌ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద ప్రార్ధనలు నిర్వహించిన ముస్లింలకు బీజేపీ అభ్యర్థి బొజ్జ రోశన్న ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ ప్యాకె ట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు ఇమాం హుసేన్‌, ప్రొఫెసరు బాషా, నెంబరువల్లి కుమారుడు మ స్తాన్‌ పాల్గొన్నారు. రంగసముద్రం ఈద్గా వద్ద పోరుమా మిళ్ల, రంగసముద్రం ప్రాంతాల ముస్లింలు ప్రత్యేక ప్రార్ధ నలు చేశారు. మత గురువులు రంజాన్‌ ప్రాముఖ్యత వివరించారు. అనంతరం బంధువులు, స్నేహితులతో కలిసి విందు భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు.

కాశినాయనలో....

కాశినాయన ఏప్రిల్‌ 11: మండల వ్యాప్తంగా గురువారం ముస్లింలు రంజాన్‌ పండుగను సంప్రదాయ బద్ధంగా చేసు కున్నారు. నర్సాపురం, గొంటువారిపల్లె, అమగంపల్ల్లె, అంబవరం, వరికుంట్ల తదితర గ్రామాల ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించారు.

మైదుకూరులో....

మైదుకూరు, ఏప్రిల్‌ 11: నెల రోజులు పవిత్ర నిష్టతో ఉన్న ముస్లింలు రంజాన్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. ఐక్యతకు ప్రతీకగా మైదుకూరులో సమీప ఈద్గాల వద్ద ప్రార్థనలు చేపట్టారు. డీఎస్పీ వెంకటేసులు పర్యవేక్షణలో ఎస్‌ఐ రాజరాజేశ్వరరెడ్డి భద్రతా చర్యలు చేపట్టారు.

ఖాజీపేటలో....

ఖాజీపేట, ఏప్రిల్‌ 11: మండల పరిధిలోని ప్రతి మసీదు లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అగ్రహారంలోని నత్తడ్‌షావల్లి ఈద్గాలో రంజాన్‌ సందర్భంగా ముస్లింలు ఉపవాసం విరమించి ప్రత్యేక ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు ప్రకటించుకున్నారు. రంజాన్‌ పండుగను మతాలకు అతీతంగా ఆనందోత్సాహాల మధ్య చేసుకున్నారు.

చాపాడులో....

చాపాడు, ఏప్రిల్‌ 11: మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు రంజాన్‌ పండుగను ఘనంగా చేసుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించుకుని ఆలింగనం చేసుకున్నారు. చాపాడు, అన్నవరం, వెదురూరు, రాజుపాళెం, అల్లాడుపల్లె, తిమ్మాయపల్లె ముస్లింలు పండుగ చేసుకున్నారు.

ఈద్గా వద్ద మజ్జిగ పంపిణీ

ప్రొద్దుటూరు, ఏప్రిల్‌ 11: రంజాన్‌పర్వదినం సందర్భంగా కొర్రపాడు రోడ్డులోని ఈద్గా మైదానంలో ప్రార్ధనలు చేసి వచ్చే ముస్లింలకు మజ్జిగ పంపిణీ చేట్టారు. టీడీపీ నేత కొండారెడ్డి ముస్లింలను కలిసి రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుతూ వారిని ఆలింగనం చేసుకుని మత సామరస్యాన్ని పాటించారు. వారికి వేసవి తాపాన్ని కొంత వరకైనా తీర్చేందుకు మజ్జిగ పంపిణీ చేపట్టామని ఆయన తెలిపారు.

Updated Date - Apr 11 , 2024 | 11:42 PM